తెలంగాణ

telangana

ETV Bharat / international

హాం​గ్​కాంగ్​: బ్రిటన్ కాన్సులేట్​ ఎదుట ఆందోళనలు - మద్ధతు

దేశంలో ప్రజాస్వామ్య పునరుద్ధరణకు అంతర్జాతీయ సమాజం సహకరించాలని కోరుతూ హాంగ్​కాంగ్​ నిరసనకారులు ర్యాలీలు చేపట్టారు. బ్రిటన్ రాయబార కార్యాలయం ఎదుట గుమిగూడి.. చైనా కబంద హస్తాల నుంచి విడిపించాలని డిమాండ్​ చేశారు. ఒక దేశంలో రెండు వ్యవస్థలు వద్దంటూ నినాదాలు చేశారు.

హాం​గ్​కాంగ్​: బ్రిటన్ కాన్సులేట్​ ఎదుట ఆందోళనలు

By

Published : Sep 15, 2019, 5:14 PM IST

Updated : Sep 30, 2019, 5:39 PM IST

హాం​గ్​కాంగ్​: బ్రిటన్ కాన్సులేట్​ ఎదుట ఆందోళనలు

దేశంలో ప్రజాస్వామ్య సంస్కరణలు చేపట్టాలని డిమాండ్​ చేస్తూ బ్రిటీష్​ రాయబార కార్యాలయం ఎదుట హాంగ్​కాంగ్​ ప్రజలు ర్యాలీ చేపట్టారు. గత కొన్ని నెలలుగా తాము చేస్తున్న ఆందోళనలకు అంతర్జాతీయ మద్దతు కావాలని కోరారు.

యూకే.. హాంగ్​కాంగ్​ను రక్షించు!

చైనా కబందహస్తాల నుంచి తమను రక్షించాలని కోరుతూ హాంగ్​కాంగ్​ ప్రజాస్వామ్యవాదులు బ్రిటన్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. బ్రిటీష్ జెండాలు పట్టుకుని, 'బ్రిటీష్​ రాణిని దేవుడు కాపాడాలి', 'హాంకాంగ్​ని యూకే రక్షించాలి' అంటూ బ్యానర్లు ప్రదర్శించారు. ఒకే దేశంలో రెండు వ్యవస్థలు వద్దంటూ నినాదాలు చేశారు.

అంతర్జాతీయ మద్దతు కావాలి

హాంగ్​కాంగ్​లో మానవహక్కుల కార్యకర్తల నిరసన ర్యాలీలకు పోలీసులు అనుమతి ఇవ్వడానికి నిరాకరించారు. అయినప్పటికీ వారు వెనక్కు తగ్గలేదు. అమెరికా జెండాలు పట్టుకొని... హాంగ్​కాంగ్​లో ప్రజాస్వామ్య సంస్కరణలు చేపట్టడానికి అంతర్జాతీయ మద్దతు కావాలంటూ ఆందోళన చేశారు.

డ్రాగన్ పడగ నీడలో...

ఒక దేశం-రెండు వ్యవస్థలుగా సాగుతున్న హాంగ్​కాంగ్​ను 99 ఏళ్ల పాటు లీజుకు తీసుకుంది బ్రిటన్​. గడువు ముగిసినందున 1997లో తిరిగి చైనాకు అప్పగించింది. ఈ ఒప్పందంలో భాగంగా హాంగ్​కాంగ్​ ప్రజలకు పూర్తి హక్కులను కల్పించేందుకు కట్టుబడి ఉన్నట్లు చైనా ప్రకటించింది. అప్పటి నుంచి చైనా ఆధ్వర్యంలో పాక్షిక స్వయంప్రతిపత్తి దేశంగా హాంగ్​కాంగ్​ కొనసాగుతోంది.

హాంగ్​కాంగ్​ నేరస్థులను చైనాకు అప్పగించే బిల్లును స్థానిక ప్రభుత్వం తీసుకువచ్చినపుడు.. దేశమంతా అట్టుడికిపోయింది. హాంగ్​కాంగ్​, చైనా ప్రభుత్వాలకు వ్యతిరేకంగా తీవ్ర ఉద్యమాలు జరిగాయి. చివరకు నేరస్థుల అప్పగింత బిల్లును ప్రభుత్వం ఉపసంహరించుకుంది. ప్రజాస్వామ్యవాదులు మాత్రం పూర్తి స్వాతంత్ర్యం కోసం పోరాటం చేస్తున్నారు.

ఘర్షణ వాతావరణం

హాంగ్​కాంగ్​లో కొనసాగుతున్న నిరసనలు పోలీసులు, ఆందోళనకారుల మధ్య ఘర్షణకు దారితీశాయి. ఆందోళనకారులపై పోలీసులు బాష్పవాయువు ప్రయోగించారు. ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి.

ఇదీ చూడండి: '2,050 సార్లు.. 21 మంది మృతి.. కవ్విస్తున్న పాక్'

Last Updated : Sep 30, 2019, 5:39 PM IST

ABOUT THE AUTHOR

...view details