తెలంగాణ

telangana

హాంకాంగ్​ వీధుల్లో మళ్లీ హోరెత్తిన నిరసనలు

హాంకాంగ్​ ఆదివారం నిరసనలతో హోరెత్తింది. చైనా తీసుకొచ్చిన వివాదాస్పద జాతీయ భద్రతా చట్టానికి వ్యతిరేకంగా వందలాది ప్రజలు వీధుల్లోకి వచ్చి ఆందోళనలు చేపట్టారు. నిరసనకారులపై పోలీసులు బాష్పవాయువు ప్రయోగించారు.

By

Published : May 24, 2020, 1:46 PM IST

Published : May 24, 2020, 1:46 PM IST

Hong Kong police fire volleys of tear gas at protesters
హాంకాంగ్​ వీధుల్లో మళ్లీ హోరెత్తిన నిరసనలు

హాంకాంగ్​ వీధుల్లో మళ్లీ నిరసనల జ్వాల చెలరేగింది. ఇటీవల చైనా ప్రవేశపెట్టిన వివాదాస్పద జాతీయ భద్రతా చట్టాన్ని వ్యతిరేకిస్తూ.. వందలాది మంది నిరసనకారులు ఆదివారం రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేపట్టారు. ప్రతిపాదిత చట్టాన్ని నిరసిస్తూ.. షాపింగ్​కు ప్రఖ్యాతి గాంచిన కాస్​వే బే జిల్లాలో నిరసనకారులు నలుపు దుస్తులు ధరించి ప్రదర్శనలు చేపట్టారు. 'హాంకాంగ్​కు మద్దతివ్వండి', 'హాంకాంగ్​కు విముక్తి ప్రసాదించండి' అంటూ నినాదాలు చేశారు. ఆందోళనకారులను నిలువరించేందుకు పోలీసులు బాష్పవాయువు ప్రయోగించారు.

హాంకాంగ్​ వీధుల్లో మళ్లీ హోరెత్తిన నిరసనలు

బిల్లు అమల్లోకి వస్తే.. జరిగేదేంటీ?

నగరంలో వేర్పాటు వాద, విధ్వంసక కార్యకలాపాలను నిషేధించేందుకు చైనా ఇటీవలే చట్టసభ ముందుకుతీర్మానాన్ని తీసుకొచ్చింది. అయితే, హాంకాంగ్​ ప్రజాస్వామ్య అనుకూల మద్దతుదారులు బిల్లును వ్యతిరేకించారు. హాంకాంగ్​పై చైనా నియంతృత్వ చర్యలకు ఇది నిదర్శనమని ఆవేదన వ్యక్తం చేశారు.

నిరసనలు చేపడుతున్న హాంకాంగ్​ వాసులు

మే 28న ఈ బిల్లు ఆమోదం పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ చట్టం అమల్లోకి వస్తే ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు చేపడుతున్న వారందరినీ చైనా ఏకపక్ష ధోరణితో అరెస్టు చేస్తుందనే భయాలు హాంకాంగ్​ వాసుల్లో నెలకొన్నాయి.

బాష్పవాయువు ప్రయోగిస్తున్న పోలీసులు
పోలీసులు, నిరసనకారుల మధ్య ఘర్షణలు

ఇదీ చదవండి:చైనా బిల్లుతో హాంకాంగ్​ చట్టసభలో నిరసనల హోరు

ABOUT THE AUTHOR

...view details