తెలంగాణ

telangana

హాంకాంగ్​: చర్చలకు నిరసనకారుల తిరస్కరణ

హాంకాంగ్​లో నేరస్థుల అప్పగింత బిల్లుపై నిరసనలు రోజురోజుకూ తీవ్రరూపం దాల్చుతున్నాయి. ఆందోళన కారులతో చర్చకు సిద్ధమని హాంకాంగ్​ సీఈఓ కారీ లామ్​ చేసిన ప్రతిపాదనను తిరస్కరించారు నిరసనకారులు.

By

Published : Aug 21, 2019, 5:08 AM IST

Published : Aug 21, 2019, 5:08 AM IST

Updated : Sep 27, 2019, 5:43 PM IST

హాంకాంగ్​: ప్రభుత్వంతో చర్చలకు నిరసనకారుల తిరస్కారం


హాంకాంగ్​లో నేరస్థుల అప్పగింత బిల్లుకు వ్యతిరేకంగా నిరసనలు చేపట్టి ఇప్పటికి 11వారాలు గడుస్తోంది. ఈ నేపథ్యంలో ఆందోళనకారులతో చర్చలకు సిద్ధంగా ఉన్నట్లు హాంకాంగ్​ ముఖ్య కార్యనిర్వహణ అధికారి కారీ లామ్​ ప్రతిపాదించారు. అయితే అందుకు నిరసనకారులు అంగీకరించలేదు.

పోలీసులపైనిరసనకారులు చేసిన దాష్టీకానికి ఇప్పటివరకు 174 కేసులు నమోదైనట్లు కారీలామ్​ తెలిపారు. ఈ దుశ్చర్యల నిగ్గు తేల్చేందుకు నిజ నిర్ధరణ కమిటీ వేయనున్నట్లు వెల్లడించారు. నేరస్థుల అప్పగింత బిల్లును మాత్రం అధికారికంగా విరమించడానికి నిరాకరించారు.

ఆందోళనకారులు మాత్రం తమ డిమాండ్లు తీర్చే వరకు నిరసనలు కొనసాగుతూనే ఉంటాయని తేల్చి చెప్పారు.

నిరసనకారుల డిమాండ్లు ఇవే

  • సార్వత్రిక ఓటు హక్కు
  • నేరస్థుల అప్పగింత బిల్లు రద్దు
  • అదుపులోకి తీసుకున్న నిరసనకారుల విడుదల

చిన్నారి

నిరసనల్లో పాల్గొని తన గళం వినిపించిన ఓ చిన్నారి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఓ వంతెనపై నిల్చొని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసింది. వంతెన కింద నుంచి భారీగా వెళ్తున్న నిరసనకారులు...చిన్నారిని అనుసరిస్తూ నినాదాలు చేశారు.

ఇదీ చూడండి:అదిరేటి డ్రస్సు మేమేస్తే.. అంటున్న శునకాలు

Last Updated : Sep 27, 2019, 5:43 PM IST

ABOUT THE AUTHOR

...view details