నిరసనకారులు మాస్క్లు ధరించడంపై ప్రభుత్వం విధించిన నిషేధాన్ని ధిక్కరిస్తూ.. హాంకాంగ్ ప్రజాస్వామ్యవాదులు కార్టూన్ మాస్క్లు ధరించి శుక్రవారం భారీ మానవహారం ఏర్పాటుచేశారు.
మాట్లాడే ఎలుగుబంటి
నిరసనకారులు చైనా అధ్యక్షుడు జిన్పింగ్ మాస్కులు ధరించి, సెల్ఫోన్ లైట్లు పట్టుకుని 'మన కాలపు విప్లవం' అని నినాదాలు చేస్తూ ఆందోళ చేపట్టారు. జిన్పింగ్ మాట్లాడే ఎలుగుబంటి లాగా ఉన్నారంటూ నెటిజన్లు చమత్కరించారు. అప్రమత్తమైన సెన్సార్ అధికారులు వీటిని తొలగించారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా.. ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలకు మాస్క్లు ఉపయోగిస్తున్నారు.