ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలతో ప్రపంచ ఆర్థిక కేంద్రం హాంగ్కాంగ్ ప్రమాదకరమైన పరిస్థితికి చేరుకుందని ఓ నాయకుడు హెచ్చిరించిన నేపథ్యంలో నిరసనలు ఉగ్రరూపం దాల్చాయి. వరుసగా మూడోరోజు పోలీసులు, ఆందోళనకారులు మధ్య ఘర్షణలు తలెత్తాయి.
సోమవారం వేల మంది వీధుల్లోకి చేరి నిరసనలు చేశారు. ఉదయాన్నే భూగర్భ రైల్వే స్టేషన్లకు చేరుకున్న ఆందోళనకారులు రైల్వే సేవలకు అంతరాయం కలిగించారు. మధ్యాహ్నం 7 ప్రధాన ప్రాంతాలు, పోలీసు స్టేషన్ల పరిసరాల్లో ర్యాలీలు నిర్వహించారు. ఆందోళనకారులను చెదురగొట్టేందుకు పోలీసులు బాష్పవాయువు, రబ్బరు బులెట్లను ప్రయోగించారు.