తెలంగాణ

telangana

ETV Bharat / international

గల'గలా' నవ్వులతో కొత్త ఏడాదికి స్వాగతం - gala

వరాహ నామసంవత్సరానికి అట్టహాసంగా స్వాగతం పలికింది చైనా ప్రజానీకం.

చైనా గలా వేడుకలు

By

Published : Feb 5, 2019, 10:56 AM IST

గలా నృత్యాలు
చైనా కొత్త ఏడాది సంబరాల్లో మునిగితేలుతోంది. శునక నామసంవత్సరానికి వీడ్కోలు చెప్పి వరాహ నామ సంవత్సరాన్ని ఆహ్వానిస్తున్నారు చైనీయులు.
చైనా నూతన సంవత్సర వేడుకల్లో గలా ప్రదర్శన ప్రత్యేకమైనది. వందలాది మంది కళాకారులు చేసిన నృత్యాలు, విన్యాసాలు అబ్బురపరిచాయి.
గలాలో నృత్యంతో పాటు సంగీతం, కామెడీ, డ్రామా ప్రదర్శనలు చేశారు.

70కోట్ల మంది వీక్షకులు..

నూతన సంవత్సరం సందర్భంగా ప్రతి ఏడాది 'గలా' ప్రదర్శన చైనా సెంట్రల్​ టెలివిజన్​ నిర్మాణంలో జరుగుతుంది. ఈ ప్రదర్శన సీసీ టీవీకి చెందిన 5 ఛానెళ్లలో ప్రపంచ వ్యాప్తంగా ప్రసారం అవుతుంది. ప్రతి సంపత్సరం దాదాపు 70కోట్ల మంది ఈ గలా నృత్యప్రదర్శనను తిలకిస్తారు. ప్రపంచంలో ఎక్కువ మంది చూసే ఎంటర్​టైన్​మెంట్​ షోగా రికార్డుల్లో ఉంది గలా. ఎక్కువ మంది వీక్షించిన టీవీ కార్యక్రమంగా గిన్నీస్​ రికార్డునూ సొంతం చేసుకుంది. 1983 నుంచి చైనాలో గలా ప్రదర్శన జరుగుతోంది.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details