తెలంగాణ

telangana

ETV Bharat / international

ఆ జన్యువుతో కరోనా మరణముప్పు రెట్టింపు- మనలోనే ఎక్కువట! - genetics cause to corona death

ఒక ప్రత్యేకమైన జన్యువు కారణంగా కరోనాతో ఊపిరితిత్తుల వైఫల్యం తద్వారా మరణం (genetics cause to covid death) సంభవిస్తున్నాయని ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ పరిశోధకులు కనుగొన్నారు. దక్షిణాసియా ప్రాంత మూలాలున్న 60% మందిలో, ఐరోపాలోని 15% మందిలో ఇది ఉంటున్నట్టు గుర్తించారు.

genetics cause to corona death
ఆ జన్యువుతో కరోనా మరణముప్పు

By

Published : Nov 6, 2021, 7:25 AM IST

ఊపిరితిత్తుల వైఫల్యానికి, తద్వారా మరణానికి కారణమవుతున్న ఒక జన్యువును (genetics cause to covid death) ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ పరిశోధకులు కనుగొన్నారు. దక్షిణాసియా ప్రాంత మూలాలున్న 60% మందిలో, ఐరోపాలోని 15% మందిలో ఇది ఉంటున్నట్టు గుర్తించారు. ఈ జన్యువు పేరు 'ఎల్‌జెడ్‌టీఎఫ్‌ఎల్‌1'. వైరల్‌ ఇన్ఫెక్షన్లు తలెత్తినప్పుడు ఊపిరితిత్తులు సహజంగా స్పందించే తీరును ఈ జన్యువులు మార్చేస్తున్నట్టు పరిశోధకులు తేల్చారు. ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడుకునేందుకు ఊపిరితిత్తుల్లోని కణాలపై ఉండే రక్షణ వ్యవస్థలను (COVID-19 death risk factors) ఈ జన్యువు నిరోధిస్తున్నట్టు కనుగొన్నారు. కృత్రిమ మేధ (ఏఐ), మాలిక్యులర్‌ సాంకేతికతల సాయంతో వారు ఈ పరిశోధన సాగించారు.

"కరోనా సోకినప్పుడు ఊపిరితిత్తుల కణాలపై ఉండే రక్షణ వ్యవస్థలు చైతన్యవంతమై, వైరస్‌ పట్ల విముఖత ప్రదర్శిస్తాయి. 'ఎల్‌జెడ్‌టీఎఫ్‌ఎల్‌1' ఈ ప్రక్రియను అడ్డుకుంటోంది. ఈ జన్యువులు ఉన్నవారి ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్‌ తీవ్రస్థాయికి చేరుతోంది. తద్వారా వారి శ్వాసవ్యవస్థ విఫలమయ్యే, మరణం సంభవించే ముప్ప రెట్టింపు అవుతోంది" అని పరిశోధనకర్త ప్రొఫెసర్‌ ఫ్రాన్సిస్‌ ఫ్లింటర్‌ పేర్కొన్నారు. కొవిడ్‌ తీవ్రరూపం దాల్చకుండా చికిత్స రూపొందించడానికి తమ పరిశోధన తోడ్పడుతుందని, ఈ జన్యువు ఎక్కువమందిలో ఉండే ప్రాంతాల్లో టీకాలను విస్తృతంగా అందించాలని ఆయన అన్నారు. నేచర్‌ జెనెటిక్స్‌ పత్రిక ఈ వివరాలు అందించింది.

ఇదీ చదవండి:రేపు భాజపా జాతీయ కార్యవర్గ భేటీ

ABOUT THE AUTHOR

...view details