తెలంగాణ

telangana

ETV Bharat / international

హాంకాంగ్​: నిరసనలతో విమాన రాకపోకలు బంద్​ - బంద్​

హాంకాంగ్​... ప్రభుత్వ వ్యతిరేక నిరసనలతో హోరెత్తుతోంది. ఆదివారం ఆందోళనకారులు విమానాశ్రయానికి వెళ్లే మార్గాలను దిగ్బంధించారు. ఫలితంగా విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

ఎయిర్​పోర్టులో నిరసనల హోరు- విమానాల రాకపోకలు బంద్​

By

Published : Sep 1, 2019, 9:54 PM IST

Updated : Sep 29, 2019, 2:46 AM IST

ఎయిర్​పోర్టులో నిరసనల హోరు- విమానాల రాకపోకలు బంద్​

హాంకాంగ్​ విమానాశ్రయం... ప్రభుత్వ వ్యతిరేక నిరసనలతో హోరెత్తుతోంది. ఆందోళనకారులు ఎయిర్​పోర్టు కార్యకలాపాలు సాగనివ్వకుండా అడ్డుకుంటున్నారు. విమానాశ్రయానికి వెళ్లే మార్గాలు అన్నింటినీ దిగ్బంధించారు.

నిరసనల కారణంగా 16 విమానాల రాకపోకలు నిలిచిపోయాయి.

రైల్వే వ్యవస్థపైనా ప్రభావం...

నిరసనకారులు నగరంలోని ప్రధాన రైల్వే స్టేషన్​ వద్ద ఆందోళనకు దిగారు. రైళ్ల రాకపోకలు అడ్డుకున్నారు. ముందు జాగ్రత్తగా భారీ స్థాయిలో భద్రతా బలగాలను మోహరించగా... ఆ ప్రాంతమంతా ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

ఇదీ చూడండి:మళ్లీ హింసాత్మకంగా మారిన హాంకాంగ్ నిరసనలు

Last Updated : Sep 29, 2019, 2:46 AM IST

ABOUT THE AUTHOR

...view details