తెలంగాణ

telangana

ETV Bharat / international

స్పేస్​వాక్​తో చైనా మహిళా వ్యోమగామి అరుదైన ఘనత - space walk by chinese astronauts

అంతరిక్ష ప్రయోగాల్లో చైనా మరో కొత్త రికార్డు నమోదు చేసింది. ఆ దేశానికి చెందిన మహిళా వ్యోమగామి వాంగ్ యాపింగ్​.. స్పేస్ ​వాక్​ చేసిన తొలి చైనా మహిళగా నిలిచారు. అంతరిక్ష కేంద్రం నుంచి బయటకు వచ్చిన ఆమె ఆరున్నర గంటలపాటు అంతరిక్షంలో నడిచారు.

china astronauts space walk
రోదసిలో చైనా మహిళ అరుదైన ఘనత

By

Published : Nov 8, 2021, 12:45 PM IST

Updated : Nov 8, 2021, 2:51 PM IST

చైనా మహిళా వ్యోమగామి స్పేస్ వాక్​

చైనాకు చెందిన మహిళా వ్యోమగామి వాంగ్​ యాపింగ్ అరుదైన ఘనత సాధించారు. స్పేస్ ​వాక్​ చేసిన తొలి చైనా మహిళగా ఆమె నిలిచారు. నిర్మాణంలో ఉన్న అంతరిక్ష కేంద్రం నుంచి బయటకు వచ్చిన వాంగ్... కొన్ని గంటలపాటు అంతరిక్షంలో నడిచారు. మరో వ్యోమగామి ఝాయ్ ఝిగాంగ్​తో కలిసి ఆమె ఈ ప్రక్రియ పూర్తి చేశారు.

స్పేస్​ వాక్​ చేస్తున్న దృశ్యాలను చూస్తున్న చైనా శాస్త్రవేత్తలు
స్పేస్​ వాక్​లో వ్యోమగాములు

సోమవారం ఉదయం.. అంతరిక్ష కేంద్రానికి చెందిన తియాన్హే కోర్​ మాడ్యూల్​ నుంచి బయటకు వచ్చిన వాంగ్​, ఝాయ్​.. 6.30 గంటలపాటు స్పేస్​ వాక్​ చేశారు. అనంతరం విజయంవంతంగా మళ్లీ మాడ్యూల్​లోకి వెళ్లారు. ఈ మేరకు జిన్హుహా వార్తాసంస్థ తెలిపింది. చైనా అంతరిక్ష చరిత్రలోనే ఓ మహిళ స్పేస్​ వాక్​లో పాల్గొనడం ఇదే తొలిసారి అని చెప్పింది.

స్వేస్​ వాక్​ అనంతరం వ్యోమగాముల ఆనందం
స్పేస్​వాక్ చేస్తున్న దృశ్యం

వాంగ్​, ఝాయ్​ అంతరిక్ష కేంద్రం కోర్​ మాడ్యూల్​ నుంచి బయటకు వచ్చి స్పేస్​ వాక్ చేస్తున్న సమయంలో మరో వ్యోమగామి యెగువాంగ్‌పు అంతరిక్ష కేంద్రంలోనే ఉండి వారికి సూచనలు చేశారు. అక్టోబరు 13న షెంజావు-13 వ్యోమనౌకను చైనా ప్రయోగించింది. ఆరు నెలల మిషన్​లో భాగంగా... ముగ్గురు వ్యోమగాములు నిర్మాణంలో ఉన్న అంతరిక్ష కేంద్రానికి ప్రవేశించారు. వీరు అంతరిక్ష కేంద్ర నిర్మాణాన్ని పూర్తి చేయనున్నారు.

అంతరిక్షంలో నడుస్తున్న వ్యోమగాములు
అంతరిక్షంలో నడుస్తున్న వ్యోమగాములు

సొంత అంతరిక్ష కేంద్రం కలిగిన దేశంగా..

నిర్మాణంలో ఉన్న అంతరిక్ష కేంద్రం కోసం చైనా చేపట్టిన రెండో మానవ సహిత అంతరిక్ష ప్రయోగమిది. ఇంతకుముందు ముగ్గురు వ్యోమగాములు 3 నెలలపాటు అంతరిక్ష కేంద్రంలో ఉండి గతనెల 17న తిరిగి వచ్చారు. వీరు అంతరిక్ష కేంద్రంలో అనేక పనులు చేశారు. వచ్చే ఏడాదికల్లా ఈ అంతరిక్ష కేంద్రం సిద్ధమవుతుందని అంచనా. ఇది పూర్తయితే సొంత అంతరిక్ష కేంద్రం కలిగిన దేశంగా చైనా అవతరించనుంది.

ఇదీ చూడండి:చైనా దూకుడు- 3 రిమోట్​ సెన్సింగ్​ శాటిలైట్లు ప్రయోగం

Last Updated : Nov 8, 2021, 2:51 PM IST

ABOUT THE AUTHOR

...view details