తెలంగాణ

telangana

ETV Bharat / international

'తాలిబన్లు అలా చేయకుంటే అంతర్యుద్ధమే' - పాకిస్థాన్​ ప్రధాని ఇమ్రాన్​ ఖాన్

తాలిబన్ల పాలనపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు (imran khan afghanistan) పాకిస్థాన్​ ప్రధాని ఇమ్రాన్​ ఖాన్. నిస్పక్షపాతంగా వ్యవహరించే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో తాలిబన్లు విఫలమైతే అఫ్గాన్​లో అంతర్యుద్ధం జరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు.

imran khan on afghanistan
'అలా చేయకుంటే అంతర్యుద్ధమే!'.. ఇమ్రాన్ ఖాన్​ హెచ్చరిక

By

Published : Sep 22, 2021, 7:52 AM IST

అఫ్గానిస్థాన్​ను ఆక్రమించుకుని తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తాలిబన్లకు (imran khan afghanistan) మద్దతు పలుకుతున్న పాకిస్థాన్​ ప్రధాని ఇమ్రాన్​ ఖాన్​.. తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. పారదర్శకత కలిగి, నిస్పక్షపాతంగా వ్యవహరించే ప్రభుత్వాన్ని (afghan news) ఏర్పాటు చేయడంలో విఫలమైతే అఫ్గాన్​లో అంతర్యుద్ధం జరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. అదే జరిగితే తీవ్రవాదులకు అఫ్గానిస్థాన్​ కంచుకోటగా మారుతుందని అభిప్రాయపడ్డారు. మంగళవారం.. ఓ ప్రముఖ వార్త సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు.

"తాలిబన్లు తమ ప్రభుత్వంలో అన్ని వర్గాల వారికి సమాన అవకాశాలు ఇవ్వాలి. లేకుంటే భవిష్యత్​లో అంతర్యుద్ధం జరిగే అవకాశం ఉంది. వారు మానవ హక్కులను గౌరవించాలి. మహిళలకు విద్య అందకుండా దూరం చేయడం ఇస్లాంకు విరుద్ధం."

-ఇమ్రాన్​ ఖాన్​, పాకిస్థాన్​ ప్రధాని

తాలిబన్ల ప్రభుత్వాన్ని పాకిస్థాన్​ గుర్తించడం మిత్రదేశాల నిర్ణయంపై ఆధారపడి ఉంటుందన్నారు ఇమ్రాన్​ ఖాన్​. తాలిబన్ల పాలనను గమనించి తుది నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు.

ఇదీ చూడండి :Joe Biden: సంక్షోభాలపై సమష్టి పోరుకు బైడెన్ పిలుపు

ABOUT THE AUTHOR

...view details