దక్షిణ కొరియా మాజీ అధ్యక్షుడు రోహ్ తై-వూ (88) (Chun Doo Hwan Roh Tae Woo) కన్నుమూశారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్రమంలో మంగళవారం తుదిశ్వాస విడిచినట్లు సియోల్ నేషనల్ యూనివర్సిటీ ఆసుపత్రి వెల్లడించింది. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న(Chun Doo Hwan Roh Tae Woo) తై వూ ఇటీవల ఆసుపత్రిలో చేరినట్లు తెలిపింది.
సైనిక తిరుగుబాటులో కీలక పాత్ర..
1979లో జరిగిన సైనిక తిరుగుబాటుకు తై-వూ (Chun Doo Hwan Roh Tae Woo) మద్దతుగా నిలిచారు. ఆ సమయంలో ఓ దళానికి నాయకత్వం వహించడం సహా అతని స్నేహితుడు చున్ దూ-వాన్‌ను అధ్యక్షుడిని చేయడంలో కీలక పాత్ర పోషించారు. అయితే సైనిక పాలనపై ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావడం వల్ల 1987లో ఎన్నికలు నిర్వహించి అధ్యక్ష పదవికి పోటీచేశారు. ఆ ఎన్నికల్లో గెలుపొందిన తై-వూ అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టారు.
తై-వూపై వ్యతిరేకత ఆయన అధ్యక్ష పదవిని వీడాక కూడా వెంటాడింది. ఫలితంగా ఆయన జైలు శిక్ష అనుభవించారు. అనంతరం ప్రభుత్వం నుంచి క్షమాభిక్ష పొంది జైలు నుంచి విడుదలైన వూ.. మిగిలిన జీవితాన్ని సమాజానికి దూరంగా ఉంటూ గడిపారు.
ఇదీ చూడండి :మసీదులో కాల్పులు.. 18 మంది దుర్మరణం