భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అరుదైన గౌరవం దక్కింది. విదేశాలకు చెందిన విశిష్ట నేతలకు మాల్దీవులు అందించే అత్యున్నత గౌరవ పురస్కారం 'రూల్ ఆఫ్ నిషాన్ ఇజ్జుద్దీన్'తో మోదీని ఆ దేశ అధ్యక్షుడు ఇబ్రహీం మోహమెద్ సోలిహ్ సత్కరించారు.
ఈ ప్రతిష్టాత్మక అవార్డు ఇరు దేశాల మధ్య మైత్రి, సంబంధాలకు ప్రతీక అని పేర్కొన్నారు ప్రధాని మోదీ.
"మాల్దీవుల దేశ అత్యున్నత పురస్కారాన్ని అందించటం నా ఒక్కడికే దక్కిన గౌరవం కాదు. ఇది యావత్ భారతదేశానికి దక్కిన గౌరవం. నిషాన్ ఇజ్జుద్దీన్ అనేది నా దృష్టిలో హర్షణీయం. ఇరు దేశాల మధ్య ఉన్న స్నేహం, సంబంధాలకు ఉదాహరణ. భారతీయులందిరి తరఫున పూర్తి వినమ్రతతో ఈ పురస్కారాన్ని స్వీకరిస్తున్నా."
- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి.