తెలంగాణ

telangana

ETV Bharat / international

ప్రపంచ వ్యాప్తంగా ఘనంగా ఈద్ పర్వదినం - ముస్లిం

ప్రపంచవ్యాప్తంగా ఈద్ ఉల్ ఫితర్​ వేడుకలను ముస్లింలు ఘనంగా జరుపుకున్నారు. వివిధ దేశాల్లో అధికారికంగా వేడుకలను నిర్వహించారు. పవిత్ర రంజాన్ మాసం ముగింపునకు సూచనగా మంగళవారం నెలవంక కనిపించింది. దీని ఆధారంగా మతపెద్దలు ఈద్ జరుపుకోవాలని ప్రకటించారు. రంజాన్ పర్వదిన ప్రత్యేక ప్రార్థనలతో మసీదులు కిక్కిరిసిపోయాయి.

ప్రపంచ వ్యాప్తంగా ఘనంగా ఈద్ పర్వదినం

By

Published : Jun 5, 2019, 7:04 PM IST

Updated : Jun 5, 2019, 8:46 PM IST

ప్రపంచ వ్యాప్తంగా ఘనంగా ఈద్ పర్వదినం

రంజాన్ పర్వదినాన్ని ముస్లింలు ఘనంగా జరుపుకున్నారు. పవిత్ర రంజాన్ మాసం ముగింపునకు సూచనగా మంగళవారం సాయంత్రం నెలవంక కనిపించింది. బుధవారం ఈద్ ఉల్ ఫితర్ జరుపుకునేందుకు ముస్లిం మతపెద్దలు నిర్ణయం తీసుకున్నారు.

ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో రంజాన్ పర్వదినాన్ని ముస్లింలు కన్నుల పండువగా జరుపుకున్నారు.

పాకిస్థాన్​లో వైభవంగా ఈద్

పాకిస్థాన్​లో ఈద్ ఉల్ ఫితర్ పర్వదినాన్ని కన్నుల పండువగా జరుపుకున్నారు. రావల్పిండిలోని షరీఫ్ ఈద్గాలో వేలసంఖ్యలో రంజాన్​ నమాజ్​లో పాల్గొన్నారు.

ఇరాన్​లో ఘనంగా రంజాన్

ఈద్​ ఉల్ ఫితర్ సందర్భంగా ఇరాన్​ రాజధాని టెహ్రాన్ జనసంద్రంగా మారింది. ఇరాన్ అధ్యక్షుడు అయాతొల్లా అలీ ఖమేనీ అధికారికంగా రంజాన్​ మాసాన్ని ముగించారు. ఇరాన్​ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు ఖమేనీ. మత సంబంధ విషయాలతోపాటు ప్రపంచంలో ముస్లింల స్థితిగతులపై ప్రసంగించారు.

ఈజిప్ట్​లో ఈద్

రంజాన్ మాసం ముగిసిన సందర్భంగా ఈద్​ ఉల్ ఫితర్ వేడుకలను ఈజిప్టులో ఘనంగా నిర్వహించారు. వివిధ మసీదులు, ఈద్గాలు భక్తులతో కిక్కిరిసి పోయాయి. కుటుంబ సభ్యులు, సన్నిహితులతో ప్రజలు ఉల్లాసంగా గడుపుతున్నారు.

బంగ్లాదేశ్​లో..

బంగ్లాదేశ్​లో ఈద్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఉదయం కురిసిన భారీ వర్షం కారణంగా బహిరంగ ప్రదేశాల్లోని ఈద్గాల్లో ప్రార్థనలు చేసేవారికి అంతరాయం ఏర్పడింది. ఎక్కువ మంది భైతుల్ ముఖర్రం జాతీయ మసీదులో ప్రార్థనలు చేశారు.

ఇండోనేషియాలో ఘనంగా ఈద్ వేడుక

ఈద్ ఉల్ ఫితర్​ వేడుకలను ఇండోనేషియా ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. పండగ ప్రత్యేక ప్రార్థనల కారణంగా అల్ అజార్ మసీదు జనసంద్రంగా మారింది.

పలుచోట్ల అశాంతి

ఈ ఏడాది చాలా ముస్లిం దేశాల్లో ఈద్ వేళ అశాంతి నెలకొంది​. అఫ్గానిస్థాన్​లో తాలిబన్ల దాడులతో అశాంతి నెలకొంది.

​యెమన్​ దేశం యుద్ధాలతో అట్టుడుకుతోంది. చాలా ఏళ్ల నుంచి కరవుకాటకాలతో కొట్టుమిట్టాడుతోంది.

మిలటరీ పాలనలో ఉన్న సూడాన్​లో హింస కొనసాగుతోంది. పవిత్ర ఈద్​కు ముందు రోజు కూడా 35 మంది ప్రజాస్వామ్యవాదులను అక్కడి సైన్యం బలిగొంది.

ముస్లిం కాలెండర్​లో రంజాన్ తొమ్మిదో నెల. నెలవంకతో మాసాన్ని ఆరంభించే ముస్లింలు రంజాన్ మాసం ఆరంభం నుంచి ముగిసే వరకు ఉపవాసం ఉంటారు. రంజాన్ మాసం ముగింపునకు సూచనగా నెలవంక కనిపించగానే ఉపవాసాలను విడిచి ఈద్​ ఉల్ ఫితర్ పర్వదినాన్ని జరుపుకుంటారు.

Last Updated : Jun 5, 2019, 8:46 PM IST

ABOUT THE AUTHOR

...view details