పాకిస్థాన్‌లోని పలు ప్రాంతాల్లో భూకంపం సంభవించింది. నైరుతి ప్రాంతంలో ఉన్న క్వెట్టా నగరంలో భూకంప తీవ్రత ఎక్కువగా నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. రిక్టర్ స్కేలుపై 5.2గా నమోదైనట్లు వెల్లడించారు. ఈ భూకంపం క్వెట్టాకు ఈశాన్యంగా 38 కి.మీ దూరంలో కేంద్రీకృతమైనట్లు అధికారులు అంచనా వేశారు.
పాకిస్థాన్‌లో కంపించిన భూమి- రిక్టర్‌స్కేలుపై 5.2 తీవ్రత
నైరుతి పాకిస్థాన్‌లోని క్వెట్టా నగరంలో భూకంపం సంభవించింది. ప్రజలందరూ ఒక్కసారిగా రోడ్ల మీదుకు వచ్చారు. రిక్టర్ స్కేలుపై 5.2గా భూకంప తీవ్రత నమోదైంది.
పాకిస్థాన్‌లో స్వల్పంగా కంపించిన భూమి
అయితే ఈ ప్రమాదంలో ఎటువంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదని అక్కడి యంత్రాంగం స్పష్టం చేసింది. క్వెట్టా ప్రాంతంలో అతి పెద్ద భూకంపం 1935లో వచ్చంది.