Earthquake In Philippines: ఫిలిప్పీన్స్‌లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై తీవ్రత 6.5గా నమోదైనట్లు ది ఫిలిప్పీన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సిస్మాలజీ తెలిపింది. స్థానిక కాలమానం ప్రకారం దావో ప్రావిన్స్ బౌల్ట్ ద్వీపంలోని సరంగనీ పట్టణంలో శనివారం ఉదయం భూప్రకంపనలు వచ్చినట్లు చెప్పింది.
భూకంపం 66 కిలోమీటర్ల లోతులో కేంద్రీకృతమైనట్లు సిస్మాలజీ డిపార్ట్మెంట్ తెలిపింది. సునామీ హెచ్చరికలు ఏమీ లేవని స్పష్టం చేసింది. ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణనష్టం వాటిల్లలేదని అధికారులు తెలిపారు.