గగనతలంలోకి ప్రవేశించిన ఓ విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేశారు చైనా అధికారులు. ఇందుకు కారణం ఓ మహిళ తాగి అద్దం పగలకొట్టడమే. వివరాల్లోకి వెళితే.. 29 ఏళ్ల లీ తాగి విమానం ఎక్కింది. తూర్పు చైనాలోని జినింగ్ నుంచి బయలుదేరిన ఈ విహంగం మార్గమధ్యంలో ఉండగా.. ఆమె విచిత్రంగా ప్రవర్తిస్తూ గందరగోళం చేసింది. పెద్దగా కేకలు వేస్తూ అక్కడున్న వారిని భయభ్రాంతులకు గురిచేసింది. అంతేకాకుండా అదే నిషాతో ఉన్న లీ.. ఒక్క గుద్దుతో విమానం అద్దాన్ని బ్రేక్ చేసింది. పక్కనే ఉన్న ప్రయాణికులు, సిబ్బంది అదుపుచేసినా.. ఆమె ఆవేశం తగ్గలేదట. ఇక లాభం లేదని భావించిన సిబ్బంది.. హెనన్ రాష్ట్రంలోని ఝన్ఝాంగౌలో అత్యవసరంగా విమానాన్ని దించారు. వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు.. ఆ మహిళను అదుపులోకి తీసుకున్నారు.
అమ్మాయి పంచ్‌కు విమానం అద్దం ఢమాల్..
సాంకేతిక కారణాలు, తీవ్ర అనారోగ్యం, వాతావరణ ప్రతికూలత వంటి పరిస్థితులు ఎదురైనప్పుడే విమానాలను అత్యవసరంగా ల్యాండ్ చేయడం చూస్తుంటాం. కానీ ఓ మహిళ తాగి చేసిన రచ్చ భరించలేక ఓ విహంగాన్ని కిందకి దించేశారు అధికారులు.
మద్యం మత్తులో
లీ ప్రేమ వ్యవహారం దెబ్బతినడం వల్లే మానసికంగా ఒత్తిడికి గురై.. ఈ విధంగా చేసినట్లు విచారణలో తేలింది. ఆమె చైనాలో విరివిగా దొరికే 'బైజియు' అనే మందు తాగిందని ఇందులో 35 శాతం నుంచి 65 శాతం ఆల్కహాల్ ఉంటుందని తెలిపారు. సోషల్‌మీడియాలో ఆమె బ్రేక్ చేసిన అద్దం ఫొటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.