సంపూర్ణ ప్రజాస్వామ్యమే లక్ష్యంగా గత ఏడు నెలలుగా నిరసనలతో హాంకాంగ్ అట్టుడుకిపోతోంది. ఈ నేపథ్యంలో హాంకాంగ్ విశ్వవిద్యాలయానికి చెందిన 30 మంది పూర్వ విద్యార్థులు.. నిరసనకారులకు మద్దతుగా ఆ దేశ పౌరులకు గళం వినిపించేలా ఓ వినూత్న పద్ధతిని ఎంచుకున్నారు. అదే నృత్యరూప ప్రదర్శన.
ఇందులో విద్యార్థులు గత ఏడునెలలుగా జరిగిన నిరసనల ఉదంతాన్ని వీడియోలో చిత్రీకరించారు. నిరసనకారులపై జరుగుతున్న ప్రభుత్వ అరాచకాలు, పోలీసుల క్రూర చర్యలు, చితికిపోయిన నిరసనకారుల జీవితాలను నృత్య రూపంలో ప్రదర్శించారు.
ఈ నృత్యరూప ప్రదర్శన ద్వారా ప్రజల్లో ఐక్యమత్యం పెంపొందించి సామాజిక ఉద్యమంలో వారిని భాగస్వాములను చేయడానికి దోహదపడుతుందని అభిప్రాయపడ్డారు.
"గత ఏడునెలలుగా జరుగుతున్న హాంకాంగ్ నిరసనకారులపై జరుగుతున్న అకృత్యాలను ఈ విడియోలో చిత్రీకరించాం. ఈ వీడియో వైరల్గా మారుతుందని ఆశిస్తున్నాం. దీని ద్వారా ప్రజల్లో అవగాహన పెరుగుతుందని భావిస్తున్నాం."