కరోనా మహమ్మారి విలయతాండవం ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతోంది. మొత్తం కేసుల సంఖ్య కోటి 84 లక్షల 89వేల 613కు చేరింది. వైరస్ కారణంగా మరణించిన వారి సంఖ్య 6లక్షల 98వేల 510కి పెరిగింది. కోటి 17లక్షల 16వేల 827మంది వ్యాధి బారినపడి కోలుకున్నారు.
సింగపూర్లో కొత్తగా 295 వైరస్ కేసులు నమోదయ్యాయి. వీరిలో ఎక్కువగా విదేశాలకు చెందిన కార్మికులే ఉన్నట్లు అధికారులు తెలిపారు. దేశంలో మొత్తం కేసుల సంఖ్య 53వేల 346కి చేరింది. ఇప్పటివరకు 27మంది ప్రాణాలు కోల్పోయారు.
పాక్లో..
పాకిస్థాన్లో మరో 432మందికి వైరస్ సోకగా..15మంది మరణించారు. మొత్తం కేసుల సంఖ్య 280,461కి చేరగా.. మృతుల సంఖ్య 5,999కి పెరిగింది.