కరోనా మహమ్మారి ధాటికి ప్రపంచమంతా లాక్డౌన్ అయిన నేపథ్యంలో ఎడ్యుకేషనల్ టెస్టింగ్ సర్వీస్ (ఈటీఎస్) కీలక నిర్ణయం తీసుకుంది. టోఫెల్, జీఆర్ఈ లాంటి ప్రపంచ స్థాయి పరీక్షలను... విద్యార్థులు ఇంటిలోనే ఉండి రాసే వీలు కల్పించింది. అయితే ఈ పరీక్షలు చైనా, ఇరాన్ దేశాల్లో నిర్వహించడం కుదరదని స్పష్టం చేసింది.
"కరోనా వైరస్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా పరీక్షలు రాయలేకపోతున్న విద్యార్థులకు ఇప్పుడు ఓ పరిష్కారం లభిస్తుంది. పరీక్ష కేంద్రాల్లో టెస్ట్లు నిర్వహించడానికి అనుకూల పరిస్థితి ఏర్పడేంత వరకు టోఫెల్, జీఆర్ఈ పరీక్షలు ఇంట్లోనే రాసుకునేందుకు వీలు కల్పిస్తాం."
- శ్రీకాంత్ గోపాల్, టోఫెల్ ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్
పటిష్ఠ భద్రత నడుమ