చైనాలో మళ్లీ కరోనా భయాలు చుట్టుముడుతున్నాయి. ఇటీవల నెగిటివ్ నిర్ధరణ అయిన కొంత మంది రోగుల నుంచి సేకరించిన కళ్లె, మలం నమూనాల్లో వైరస్ను గుర్తించారు ఆ దేశ వైద్యులు. ఈ అధ్యయనం అన్నల్స్ ఆఫ్ ఇంటర్నల్ మెడిసిన్ జర్నల్లో ప్రచురితమైంది.
కరోనాకు గురైన వ్యక్తికి ఆసుపత్రి నుంచి విడుదలయ్యే ముందు.. ఎక్కువగా కఫం ద్వారా పరీక్షలు నిర్వహిస్తారు. ఈ ఫలితాలను బట్టే సదరు రోగిని క్వారంటైన్లో ఉంచాలా లేదా అని నిర్ణయిస్తారని చైనాలోని క్యాపిటల్ వైద్య విశ్యవిద్యాలయం పరిశోధలుకు తెలిపారు. వచ్చిన ఫలితాలు సరైనవేనా.. లేక శరీరంలోని ఇతర భాగాల నుంచి నమూనాలను సేకరించాలా అనే విషయంపై పరిశోధకులు చర్చలు జరుపుతున్నారు. పరీక్షల్లో నెగిటివ్గా తేలిన తర్వాత కూడా కొందరు రోగుల కళ్లెలో 39 రోజుల వరకు వైరస్ ఉంటున్నట్లు గుర్తించారు. మలంలో 13 రోజుల పాటు ఈ సూక్ష్మజీవి ఉనికి కనిపిస్తున్నట్లు తెలిపారు.