ప్రపంచ దేశాలను కరోనా మహమ్మారి గడగడలాడిస్తోంది. రోజూ లక్షలాది మంది వైరస్ బారిన పడుతున్నారు. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా కేసుల సంఖ్య 2.50 కోట్లకు చేరువైంది. వైరస్ ధాటికి 8.36 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు.
కరోనా మహమ్మారి
By
Published : Aug 28, 2020, 7:16 PM IST
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ అంతకంతకూ విజృంభిస్తోంది. పలు దేశాల్లో భారీ సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటివరకు 2.46 కోట్ల మందికి వైరస్ సోకగా.. 8.36 లక్షల మంది మృత్యువాత పడ్డారు. సుమారు 1.71 కోట్ల మంది కోలుకున్నారు.
3 దేశాల్లోనే..
అమెరికా, బ్రెజిల్, భారత్‌లో వైరస్ ఉద్ధృతి కొనసాగుతోంది. ఈ 3 దేశాల్లో కలిపి రోజూ 1.5 లక్షలకు పైగా కేసులు నమోదవుతున్నాయి.
రష్యాలో వైరస్ వ్యాప్తి స్థిరంగా ఉంది. కొత్తగా 4,829 కేసులు నమోదు కాగా.. మొత్తం సంఖ్య 9.80 లక్షలకు చేరింది. మరణాల సంఖ్య 17 వేలకు చేరువైంది.
పలు దేశాల్లో ఇలా..
పొరుగు దేశం నేపాల్‌లో కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. కొత్తగా 927 కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు ఆ దేశంలో 36 వేల మంది వైరస్ బారిన పడ్డారు.
పాకిస్థాన్‌లో మరో 415 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధరించారు. దేశవ్యాప్తంగా 2.95 లక్షల కరోనా కేసులు ఉన్నాయి.
సింగపూర్‌లో శుక్రవారం 94 కేసులు నమోదయ్యాయి. ఇందులో 10 మంది విదేశాల నుంచి వచ్చినట్లు ఆ దేశ ఆరోగ్య శాఖ తెలిపింది. ఇప్పటివరకు సింగపూర్‌లో 56 వేల మందికి వైరస్ సోకింది.
మెక్సికో, ఫిలిప్పీన్స్, ఇండోనేసియాలోనూ రోజూ 3 వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి.