తెలంగాణ

telangana

ETV Bharat / international

ఆ మాస్కులను రోజూ ఉతకకపోతే అంతే!

వస్త్రంతో తయారు చేసే మాస్కులను అధిక ఉష్ణోగ్రతల మధ్య ప్రతి రోజు ఉతికితేనే కరోనా సోకకుండా ఉంటుందని ఓ అధ్యయనం తేల్చింది. అలా చేయకపోతే అవి కలుషితంగానే మిగిలిపోతాయని వెల్లడించింది.

Cloth masks my protect from viruses only if washed daily: Study
ఆ మాస్కులను రోజు ఉతకకపోతే అంతే!

By

Published : Oct 12, 2020, 6:15 PM IST

కరోనా నుంచి రక్షించుకునేందుకు మాస్కులు ధరించడం తప్పని సరి. ఇందుకోసం మర్కెట్లో వివిధ రకాల మాస్కులు అందుబాటులో ఉంటున్నాయి. వీటితో పాటు అనేకమంది ఇంట్లోనే వస్త్రాలతో మాస్కులు తయారు చేసుకుంటున్నారు. అయితే ఈ తరహా మాస్కులను.. అధిక ఉష్ణోగ్రతల మధ్య రోజూ ఉతకాలని, లేకపోతే కరోనా సోకకుండా ఇవి అడ్డుకోలేవని ఆస్ట్రేలియా న్యూ సౌత్​ వేల్స్​ విశ్వవిద్యాలయం పరిశోధకులు చేసిన ఓ అధ్యయనం ద్వారా తెలిసింది.

"వస్త్రంతో తయారు చేసిన మాస్కులతో పాటు సర్జికల్​ మాస్కులను ఒకసారి వినియోగించిన అనంతరం వాటిని కలుషితమైనవిగా పరిగణించాలి. సర్జికల్​ మాస్కులను పడేస్తారు. కానీ వస్త్రంతో రూపొందించిన మాస్కులను చాలా రోజుల పాటు వాడతారు. అయితే.. చేతులతో వీటిని కడిగినా, తుడిచినా ఇవి ఇంకా కలుషితంగానే ఉంటాయని మా పరిశోధనలో తేలింది."

--- రైనా మాక్లెన్​టైర్​, ఆస్ట్రేలియా న్యూ సౌత్​ వేల్స్​ విశ్వవిద్యాలయం.

2015లో ప్రచురించిన ఆర్​సీటీ(రాండమైజెడ్​ కంట్రోల్డ్​ ట్రయల్​) డేటాను విశ్లేషించారు పరిశోధకులు. వైరస్​ ఇన్​ఫెక్షన్​ను నిరోధించడంలో వస్త్రంతో రూపొందించిన మాస్కుల సామర్థ్యాన్ని ఇందులో పరిశీలించారు.

తాము వినియోగించే మాస్కులను ఆరోగ్య కార్యకర్తలు రోజు కడుగుతున్నారా? అనే విషయానికి సంబంధించి 2011లో సేకరించిన డేటాను పరిశోధకులు విశ్లేషించారు. అయితే ఈ అధ్యయనంలో సార్స్​-కొవ్​-2ను పరీక్షించలేదు. ఇన్​ఫ్లుయెంజా, రినో వైరస్​ వంటి పాథోజెన్లను పరిశీలించారు.

ఇదీ చూడండి:-ఎదుటివాళ్లు మాస్క్​ పెట్టుకోలేదా? ఇలా చెప్పండి..

ABOUT THE AUTHOR

...view details