భారత్లో అంతర్జాల సేవలు అత్యంత తక్కువ ధరకేలభిస్తున్నట్లు యూకేకి చెందిన కేబుల్ వెబ్‌సైట్ తెలిపింది. అంతర్జాతీయంగా 230 దేశాల్లో అమలవుతున్న అంతర్జాల సేవల ధరల ఆధారంగా ఈ సర్వే నిర్వహించింది.అన్ని దేశాల్లోసరాసరిగా 1 జీబీ ఇంటర్నెట్ ధర రూ.600 పలుకుతోంది. కాని భారత్లో మాత్రం కేవలం రూ.18.50 కే లభ్యమవుతోంది.. యూకేలో 1జీబీ డేటా పొందాలంటే 6.66 అమెరికన్ డాలర్లు, అమెరికాలో 12.37 డాలర్లు వెచ్చించాల్సిందే. ప్రపంచ వ్యాప్తంగా వివిధ సంస్థలు అందిస్తున్న 6,313 డేటా ప్లాన్లను పరిశీలించిన తర్వాత కేబుల్ వెబ్‌సైట్ ఈ నివేదికను విడుదల చేసింది.
ఈ నివేదిక ప్రకారం 1 జీబీ డేటా కోసం జింబాబ్వేలో అత్యధికంగా 75.20 డాలర్లు చెల్లించాల్సి వస్తే ఆఫ్రికాలో కొన్ని ప్రాంతాల్లో ఒక్క డాలరు, మరి కొన్ని చోట్ల అదే డేటాకు దాదాపు 50 డాలర్లు ఖర్చు చేయాల్సి వస్తోంది. ఇలా 1జీబీ డేటా చైనాలో(9.89డాలర్లు), శ్రీలంకలో(0.87డాలర్లు), బంగ్లాదేశ్‌లో(0.99 డాలర్లు), పాకిస్థాన్‌లో(1.85 డాలర్లు) పలుకుతోంది.