తెలంగాణ

telangana

ETV Bharat / international

చైనాలో ఒక్కసారిగా 1,290 పెరిగిన కరోనా మరణాలు - కరోనా వైరస్

కరోనా కేసులు, మృతుల సంఖ్యలో చైనా వైఖరిపై ఆది నుంచి ప్రపంచదేశాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. వీటిని నిజం చేస్తూ తాజాగా చైనా కళ్లు తిరిగే గణాంకాలు వెల్లడించింది. కరోనాకు పుట్టినిల్లుగా భావిస్తోన్న వుహాన్​ నగరంలో మృతుల సంఖ్య 1,290 పెరిగినట్లు ప్రకటించింది.

WUHAN
తప్పయిపోయింది.. వుహాన్​ మృతుల సంఖ్య ఇది: చైనా

By

Published : Apr 17, 2020, 9:57 AM IST

"ఏదో జరుగుతోంది... అయినా కరోనాకు పుట్టినిల్లు అయిన వుహాన్​లో ఇంత తక్కువ మరణాలా?".... ఇది చైనా గణాంకాలు విన్న ప్రతి ఒక్కరు చెప్పిన మాట. ఇప్పుడు ఈ అనుమానమే నిజమైంది. వుహాన్​ నగరం మృతుల సంఖ్యను ఒక్కసారే 50 శాతం పెంచింది చైనా. అంటే కొత్తగా 1,290 మరణాలను లెక్కల్లో చేర్చింది.

ఇంతకుముందు వుహాన్​లో మృతుల సంఖ్య 2,579గా ఉంది. ప్రస్తుతం కొత్త గణాంకాలను కలుపుకుంటే వుహాన్​లో మొత్తం మృతుల సంఖ్య 3,869కి పెరిగింది.

అయితే తప్పుగా గణించడం వల్లే వీటిని గుర్తించలేకపోయామని చైనా చెప్పుకొచ్చింది.

ABOUT THE AUTHOR

...view details