వుహాన్.. కొన్ని నెలలుగా ప్రపంచ దేశాలను కలవరపెడుతున్న చైనాలోని ఓ నగరం. ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ పుట్టినిల్లు. ఇన్ని రోజులు ఇక్కడి ప్రజలు అనేక ఆంక్షల మధ్య నలిగిపోయారు. ఓ వైపు వైరస్ విజృంభణ.. మరోవైపు లాక్డౌన్తో ఉక్కిరిబిక్కిరైపోయారు. ఇప్పుడు ఒక్కసారిగా పరిస్థితులు మారిపోయాయి. 76రోజుల లాక్డౌన్ నుంచి వుహాన్వాసులకు ఎట్టకేలకు విముక్తి లభించింది.
దీపకాంతులతో కొత్త కళ...
లాక్డౌన్ ఎత్తివేత సందర్భంగా నగరమంతా కొత్త కళను సంతరించుకుంది. లక్షలాది విద్యుత్ దీపాల అలంకరణల మధ్య దగదగా మెరిసిపోయింది. నగరంలోని ప్రముఖ యంగేట్జ్ నది వంతెన, ఎత్తైనా భవనాలు విద్యుత్ దీపాలతో ముస్తాబైపోయాయి. కరోనా బాధితులకు తమ ప్రాణాలను పణంగా పెట్టి చికిత్స అందించిన వైద్యుల చిత్రాలను భవనాలపై ప్రదర్శించి కృతజ్ఞతలు తెలిపింది ప్రభుత్వం.
సంబరాల్లో ప్రజలు