టిబెట్‌ను దక్షిణాసియాకు కలుపుతూ ఒక కీలక, వ్యూహాత్మక మార్గాన్ని చైనా నిర్మించనుంది. 14వ పంచవర్ష ప్రణాళిక ముసాయిదాలో ఈ విషయాన్ని చైనా పొందుపరిచినట్లు ఆ దేశ అధికార వార్తా సంస్థ తెలిపింది. ప్రస్తుతం చైనాలో కీలక నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్(ఎన్‌పీసీ) సమావేశాలు జరుగుతున్నాయి. ఇందులోనే 2021-25 ప్రణాళిక ముసాయిదాను ఆమోదిస్తారు.
అక్కడ కీలక మార్గం నిర్మించనున్న చైనా
బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్‌లో భాగంగా వ్యూహాత్మక మార్గాన్ని నిర్మించనుంది చైనా. టిబెట్‌ను దక్షిణాసియాకు కలిపే కీలక మార్గానికి ప్రతిపాదన సిద్ధం చేసింది.
కీలక మార్గం నిర్మించనున్న చైనా
ఎప్పటినుంచో టిబెట్‌ను, నేపాల్‌ను కలుపుతూ ఒక మార్గాన్ని నిర్మించాలని చైనా భావిస్తోంది. ప్రస్తుత ప్రణాళికలో ఆ విషయాన్ని ప్రస్తావించకపోయినా ప్రతిపాదిత మార్గం.. చైనా ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ (బీఆర్‌ఐ)లో భాగమేనని తెలుస్తోంది.