కొవిడ్‌ను ఎదుర్కోవడానికి చైనా టీకా తెచ్చి సాయం చేస్తా అన్నా.. అది అందుకోవడం ప్రపంచానికి భారంగానే మారేట్లుంది. చాలా దేశాలు ప్రతి ఒక్కరికీ టీకా అందేట్లు చేయాలనే లక్ష్యంతో కొనుగోళ్లకు పోటీ పడుతున్నాయి. ఇప్పుడున్న ప్రత్యేక పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని చాలా కంపెనీలు టీకా ధరలు పెనుభారం కాకుండా చూసుకొంటున్నాయి. కానీ, చైనాకు చెందిన సినోఫార్మా నిర్ణయించిన ధర చూస్తే బెదిరిపోవాల్సిందే. ఇప్పటికే మూడో దశ క్లినికల్ ట్రయల్స్ మొదలుపెట్టిన 'సినోఫార్మా' వీలైనంత త్వరగా వ్యాక్సిన్‌ను మార్కెట్లోకి తీసుకురావాలని భావిస్తోంది.
రెండు డోసులు రూ. 10వేలు..
ఇటీవల సినోఫార్మ ఛైర్మన్ లి జింగ్‌జాన్ తమ టీకా 1000 యువాన్లలోపే ఉంటుందని పేర్కొన్నారు. అంటే అమెరికా కరెన్సీలో దాదాపు 144డాలర్లు. దీనిని నేటి విలువ ప్రకారం భారత కరెన్సీలోకి మారిస్తే రూ.10,791. దీంతో పోల్చుకుంటే అమెరికా కంపెనీ మోడెర్నా తయారు చేసే టీకా రెండు డోసుల ధర 37 డాలర్లలోపు ఉంటుంది. మన రూపాయిల్లోకి మారిస్తే రూ. 2,773 ఉంటుంది. ఇక ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం తయారు చేస్తున్న టీకా ధర రెండు డోసులు కలిపి ఆరు డాలర్లు (రూ.550) ఉండొచ్చు. ఇక భారత్ బయోటెక్ తయారు చేస్తున్న కోవాగ్జిన్ ధర మిగిలిన వాటి కంటే చౌకగానే ఉంటుందని ఆ సంస్థ ఎండీ కృష్ణ ఎల్లా ఇప్పటికే తెలిపారు.
ఎన్ని టీకాలు ఏ దశల్లో ఉన్నాయి..