తెలంగాణ

telangana

ETV Bharat / international

యాప్​లపై నిషేధం వివక్షపూరిత చర్య: చైనా - 59 chinese apps ban news

సరిహద్దులో ఉద్రిక్తతల నేపథ్యంలో తమ దేశానికి చెందిన 59 యాప్​లను నిషేధించడాన్ని చైనా తప్పుబట్టింది. భారత్ నిర్ణయం వివక్ష పూరితంగా ఉందని విమర్శించింది. వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్​ చేసింది.

China urges India to end 'discriminative' controls
యాప్​ల నిషేధం వివక్షపూరిత చర్య: చైనా

By

Published : Jul 3, 2020, 5:01 AM IST

తమ దేశానికి చెందిన 59 యాప్​లపై భారత్​ నిషేధం విధించడాన్ని చైనా తీవ్రంగా తప్పుబట్టింది. భారత ప్రభుత్వ చర్య వివక్షపూరితంగా ఉందని చైనా వాణిజ్య శాఖ అధికార ప్రతినిధి గావో ఫెంగ్ విమర్శించారు. వెంటనే నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. తమ దేశ వ్యాపార సంస్థలపై వివక్షపూరిత ధోరణులను ఇకనైనా మానుకోవాలన్నారు.

భారత్​కు దిగుమతి చేసే వస్తువులపై తాము ఎలాంటి చర్యలు తీసుకోలేదని చెప్పారు ఫెంగ్. యాప్​లపై నిషేధం నిర్ణయాన్ని భారత్​ వెనక్కి తీసుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇదీ చూడండి:డిజిటల్ యుద్ధం: 59 చైనా యాప్​లపై నిషేధం

ABOUT THE AUTHOR

...view details