చైనా వసంతానికి మంచు వెన్నెల కొత్త అందాలు తీసుకొచ్చింది. రెండు రోజులుగా కురుస్తోన్న శ్వేతవర్ణ హిమపాతంతో చైనా దేశం వెండి వెలుగులు విరజిమ్ముతోంది. వసంత పుష్పాలు గుబాళిస్తున్నాయి. ఆ పూల సొగసులు ప్రకృతి ప్రేమికుల్ని అలరిస్తున్నాయి.
చైనా వసంతానికి-మంచు వెన్నెల స్వాగతం - హిమపాతం
చైనాలో వసంతకాలం మొదలైంది. ఎడతెరపి లేకుండా కురుస్తోన్న మంచుతో చైనాలో ఉష్ణోగ్రతలు తీవ్రంగా పడిపోతున్నాయి. మరోవైపు ప్రకృతి ప్రేమికులు ఈ మంచు వర్షాన్ని ఆస్వాదిస్తున్నారు.
చైనా వసంతానికి-మంచు వెన్నెల స్వాగతం
మరోవైపు ఎడతెరపిలేని మంచు కురుస్తుండడం వల్ల పలు నగరాల్లో ఉష్ణోగ్రతలు పడిపోయాయి. రహదారులపై మంచు పేరుకుపోవడం వల్ల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఇదీ చూడండి:ఈ నేపాలీ 'రాక్‌స్టార్'.. కాఫీ కళకు రారాజు