తెలంగాణ

telangana

ETV Bharat / international

అక్కడ పూర్తిస్థాయిలో తెరుచుకోనున్న పాఠశాలలు

చైనాలోని పాఠశాలలు సోమవారం పూర్తి స్థాయిలో తెరుచుకోనున్నాయి. ఈ నేపథ్యంలో అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. మాస్కులు, భౌతిక దూరాన్ని పాటిస్తూ విద్యార్థులు పాఠాలు వినేందుకు తగిన ఏర్పాట్లు చేశారు. కళాశాలలు కూడా వచ్చే వారం తెరుచుకోనున్నాయి.

By

Published : Aug 29, 2020, 5:35 AM IST

China set to fully reopen schools
అక్కడ పూర్తిస్థాయిలో తెరుచుకోనున్న పాఠశాలలు

కరోనా వైరస్​ పుట్టినిల్లు చైనాలో పరిస్థితులు దాదాపు సాధారణ స్థితికి చేరాయి. ఈ నేపథ్యంలో 75శాతం పాఠశాలలు ఇప్పటికే నడుస్తుండగా.. లాక్​డౌన్​ కారణంగా మూతపడ్డ మిగిలిన 25శాతం బడులు సోమవారం తెరుచుకోనున్నాయి.

స్కూళ్లల్లో.. మాస్కులు, భౌతిక దూరం నిబంధనలను పాటించేందుకు అధికారులు ముమ్మర చర్యలు చేపట్టారు. పక్కా షెడ్యూల్​ను కూడా రూపొందించారు.

మరోవైపు అండర్​ గ్యాడ్యుయేట్లకు కూడా వచ్చే వారమే కళాశాలలు తెరుచుకోనున్నాయి. బీజింగ్​లోని 6లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు.

చైనాలో శుక్రవారం కేవలం 9 కేసులే నమోదయ్యాయి. వీరందరూ విదేశాల నుంచి వచ్చిన వారే. దేశవ్యాప్తంగా 288మంది వైరస్​కు చికిత్సపొందుతున్నారు. ఇప్పటివరకు 85,013 కేసులు వెలుగులోకి వచ్చాయి. 4,634మంది కరోనా ధాటికి ప్రాణాలు కోల్పోయారు.

ఇదీ చూడండి-చైనా 'కరోనా వ్యాక్సిన్'​​ విడుదల.. తక్షణమే వినియోగంలోకి!

ABOUT THE AUTHOR

...view details