తెలంగాణ

telangana

ETV Bharat / international

చైనా మధ్యవర్తిత్వం - భారత్​-పాక్​

చైనా తన విదేశాంగశాఖ సహాయమంత్రి కాంగ్​ను పాకిస్థాన్​కు పంపింది. భారత్​-పాక్​ మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో దాయాది దేశాలు శాంతి చర్చలు చేపట్టేలా చైనా ప్రయత్నాలు చేస్తోంది.

చైనా మధ్యవర్తిత్వం

By

Published : Mar 7, 2019, 5:30 AM IST

భారత్​-పాక్​ మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో చైనా తన విదేశాంగశాఖ సహాయమంత్రి కాంగ్​ జువాన్యుయును పాకిస్థాన్​కు పంపించింది. ఇరు దేశాల మధ్య శాంతియుత వాతావరణం నెలకొల్పాలని, చర్చల ద్వారా దాయాది దేశాలు తమ సమస్యలను పరిష్కరించుకోవాలని డ్రాగన్​ దేశం సూచించింది.

"ఉపఖండంలో శాంతి, సుస్థిరత నెలకొల్పడానికి చైనా కృషి చేస్తోంది. భారత్​-పాక్​లు స్నేహపూర్వక సంబంధాలు కొనసాగిస్తాయని చైనా నమ్ముతోంది. ఇరుదేశాల మధ్య శాంతియుత వాతావరణంలో సుహృద్భావ చర్చలు జరపడానికి చైనా నిర్మాణాత్మక పాత్ర పోషిస్తుంది."

-లు కాంగ్​, చైనా విదేశాంగశాఖ అధికార ప్రతినిధి

పాక్​ను ప్రోత్సహిస్తాం....

భారత్​-పాక్​లతో చైనా సంప్రదింపులు జరుపుతోందని లు కాంగ్​ తెలిపారు. తీవ్రవాద నిర్మూలనకు పాక్​ కృషిచేస్తోందని చైనా కితాబివ్వడం గమనార్హం.

"వాస్తవానికి, పాకిస్థాన్ తీవ్రవాదాన్ని ఎదుర్కోవటానికి ప్రయత్నాలు చేస్తోంది. ఈ విషయంలో మేము పాక్​ను ప్రోత్సహిస్తున్నాం."

-లు కాంగ్​, చైనా విదేశాంగశాఖ అధికార ప్రతినిధి

చైనా మడతపేచీ

ఉగ్రవాదంపై నీతి వాక్యాలు చెబుతోన్న చైనా, జైషే మహ్మద్ వ్యవస్థాపకుడు మసూద్​ అజార్​ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలన్న భారత్ ప్రయత్నాలకు మాత్రం మోకాలడ్డుతోంది. ఫ్రాన్స్, యూకే, అమెరికా మసూద్​ అజార్​ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలని ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో ప్రతిపాదన చేసింది. 'వీటో' అధికారమున్న చైనా అందుకు ససేమిరా అంది.

ABOUT THE AUTHOR

...view details