కరోనా సంబంధిత విషయాల్లో మొదటి నుంచి గోప్యతను పాటిస్తూ వస్తున్న చైనా.. టీకాలు విషయంలోనూ అదే వైఖరిని అవలంభిస్తోంది. వ్యాక్సినేషన్‌లో భాగంగా ఇప్పటివరకు 100కోట్ల టీకా డోసులను(china vaccination for covid 19) పంపిణీ చేసినట్లు చైనా వెల్లడించింది. అయితే మొత్తం జనాభాలో ఎంతశాతం మందికి వ్యాక్సిన్ ఇచ్చారు? ఒకటి, రెండు డోసులకు సంబంధించిన వివరాలపై మాత్రం డ్రాగన్ స్పష్టత ఇవ్వలేదు.
Vaccination: చైనాలో 100 కోట్ల డోసులు పంపిణీ! - China corona situation
చైనాలో ఇప్పటివరకు 100కోట్ల డోసులు పంపిణీ చేసినట్టు చైనా ప్రకటించింది. నెలాఖరికి 40శాతం మందికి రెండు డోసులు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆ దేశ ఆరోగ్య విభాగం నేషనల్ హెల్త్ కమిషన్ తెలిపింది.
140 కోట్ల జనాభా ఉన్న చైనాలో ఈ నెల చివరి నాటికి 40 శాతం మందికి రెండు డోసులను ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆ దేశ ఆరోగ్య విభాగం నేషనల్ హెల్త్ కమిషన్ వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా 260 కోట్ల డోసులు పంపిణీ కాగా వీటిలో చైనా అగ్రస్థానంలో ఉంది. నాలుగు కరోనా వ్యాక్సిన్లు సైతం చైనాలో అందుబాటులో ఉన్నట్లు సమాచారం. టీకాలపై ప్రజల్లో నెలకొన్న అపోహలను తగ్గించేందుకు పలు ఆకర్షణీయమైన కార్యక్రమాలను చైనా నిర్వహిస్తోంది.
ఇదీ చూడండి:ఆ దేశాలను ఎదుర్కొనేందుకు చైనా కొత్త తంత్రం!