కరోనా వైరస్ నియంత్రణలో కీలక విజయం సాధించింది చైనా. వరుసగా రెండో రోజు అక్కడ దేశీయంగా ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదని వెల్లడించింది ఆ దేశ జాతీయ ఆరోగ్య కమిషన్.
గతేడాది వూహాన్లో కరోనా వైరస్ వెలుగుచూసినప్పటి నుంచి ఒక్క కరోనా పాజిటివ్ కేసు కూడా నమోదు కాని రోజు లేదు. కానీ, ఈ రెండు రోజులుగా మాత్రం చైనావాసులకు కరోనా వ్యాపించిన దాఖలాలు కనిపించలేదు. ఈ రెండు రోజుల్లో కేవలం 31 మంది కరోనా అనుమానితులును గుర్తించినప్పటికీ.. వారిలో ఏ ఒక్కరికీ వైరస్ ఉన్నట్లు అధికారికంగా నిర్ధరణ కాలేదు.