తెలంగాణ

telangana

ETV Bharat / international

'కరోనా పుట్టుక మా దేశంలో కాదు'

కరోనా వైరస్​ మూలాలపై దర్యాప్తు చేసేందుకు డబ్యూహెచ్​ఓ బృందం త్వరలోనే చైనా వెళ్లనున్న క్రమంలో కీలక వ్యాఖ్యలు చేసింది డ్రాగన్​ దేశం. వుహాన్​లో తొలుత కేసులు వెలుగు చూసినంత మాత్రానా.. ఈ మహమ్మారి అక్కడే ఉద్భవించినట్లు కాదని స్పష్టం చేసింది. వైరస్​ మూలాలను కనుగొనే ప్రక్రియ చాలా క్లిష్టమైనదని, అందుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న శాస్త్రవేత్తల సహకారం అవసరమని తెలిపింది.

coronavirus origin
కరోనా వైరస్​ మూలాలపై దర్యాప్తు

By

Published : Nov 28, 2020, 5:10 AM IST

Updated : Nov 28, 2020, 3:15 PM IST

కరోనా మహమ్మారి కారణంగా యావత్​ ప్రపంచం తీవ్రంగా ప్రభావితమైంది. ఈ క్రమంలో వైరస్​ మూలాలను కనుగొనేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ దర్యాప్తు అనివార్యమైంది. డబ్ల్యూహెచ్​ఓ దర్యాప్తునకు ముందు వైరస్​ మూలాలపై కీలక వ్యాఖ్యలు చేసింది చైనా. కొవిడ్​-19 కేసులు తొలుత వెలుగు చూసినంత మాత్రానా.. ఈ మహమ్మారి వుహాన్​లో ఉద్భవించినట్లు కాదని పేర్కొంది.

భారత్​ సహా పలు దేశాల నుంచి దిగుమతి చేసుకున్న ఆహార పదార్థాల్లో వైరస్​ను గుర్తించినట్లు చైనాకు చెందిన పలు మీడియా సంస్థలు కొద్ది రోజుల క్రితం కథనాలు ప్రచురించాయి. విదేశాల నుంచే చైనాలోకి వైరస్​ ప్రవేశించినట్లు ఆరోపించాయి. ఈ నేపథ్యంలో వైరస్​ మూలాలపై అడిగిన ప్రశ్నకు.. చైనాలో తొలుత గుర్తించినంత మాత్రాన ఇక్కడే పుట్టినట్లు కాదని పేర్కొన్నారు ఆ​ దేశ విదేశాంగ శాఖ ప్రతినిధి ఝావో లిజియన్​.

“ కరోనా వైరస్​ తొలుత వెలుగు చూసినప్పటికీ, వైరస్​ ఉద్భవించిన ప్రదేశం చైనా అని దాని అర్థం కాదు. వైరస్​ మూలాలను కనుగొనే ప్రక్రియ చాలా క్లిష్టమైన శాస్త్రీయ సమస్యగా భావిస్తున్నాం. అందుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న శాస్త్రవేత్తల సహకారం అవసరం. వైరస్​ మూలాలను కనుగొనే ప్రక్రియ చాలా దేశాలు, ప్రాంతాలతో ముడిపడి నిరంతరం కొనసాగే ప్రక్రియ. కాబట్టి మేము భవిష్యత్తులో ఎదురయ్యే ప్రమాదాలను అడ్డుకునేందుకే ప్రయత్నిస్తాం.”

- ఝావో లిజియన్​, చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి.

ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్​ఓ) కరోనా మూలలపై దర్యాప్తు చేసేందుకు త్వరలోనే చైనాకు బృందాన్ని పంపనున్న క్రమంలో ఈ మేరకు లిజియన్​ వ్యాఖ్యానించటం ప్రాధాన్యం సంతరించుకుంది.

ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తోన్న కరోనా వైరస్​ చైనాలోనే పుట్టిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ పలు సందర్భాల్లో పేర్కొన్నారు. దానిని చైనా వైరస్​గానే అభివర్ణిస్తూ..డ్రాగన్​ దేశంపై విమర్శలు చేశారు. వైరస్​ను చైనా కట్టడి చేయగలిగిందన్న డబ్ల్యూహెచ్​ఓ వాదనలనూ ఖండించారు. ఈ క్రమంలోనే డబ్ల్యూహెచ్​ఓకు నిధులను నిలిపివేయటం సహా డబ్ల్యూహెచ్​ఓ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. వూహాన్​లోని బయోల్యాబ్​లో నుంచి వైరస్​ ఉద్భవించిందన్న వాదనలు మొదటి నుంచి కొట్టిపారేస్తోంది చైనా.

ఇదీ చూడండి: చైనాపై 'కరోనా' దర్యాప్తునకు డబ్ల్యూహెచ్​ఓ చర్యలు

Last Updated : Nov 28, 2020, 3:15 PM IST

ABOUT THE AUTHOR

...view details