తెలంగాణ

telangana

ETV Bharat / international

'కరోనా వైరస్​.. చైనా ల్యాబ్​లోనే పుట్టిందని రుజువేంటి?' - china created corona virus

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా.. చైనా ల్యాబ్​లోనే పుట్టిందనే ఆరోపణను ఖండించింది చైనా విదేశాంగ శాఖ. వైరస్​ తమ ప్రయోగశాలలో సృష్టించినట్లు ఎలాంటి రుజువులు లేవని పేర్కొంది. అయితే, ఇప్పుడు చైనాలో కాస్త కుదుటపడ్డ కరోనా వ్యాప్తి.. నవంబర్​లో మరోసారి విజృంభిస్తుందని వైద్యులు తెలిపారు.

china opposes the allegation of donald trump that  corona virus created in china lab by saying it has no proof for it
'కరోనా.. చైనా ల్యాబ్​లోనే పుట్టిందని రుజువేంటి?'

By

Published : Apr 17, 2020, 8:20 AM IST

కరోనా వైరస్‌ను ల్యాబ్‌లో సృష్టించినట్లు ఎటువంటి ఆధారాలు లేవని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) ఇదివరకే స్పష్టం చేసినట్లు.. చైనా విదేశాంగశాఖ పేర్కొంది. ఈ మహమ్మారి మొదట ఆ దేశంలోని వుహాన్‌ నగరంలో వెలుగుచూసింది. అక్కడే ఓ ల్యాబ్‌లో కరోనా వైరస్‌ను సృష్టించారనే ఆరోపణలను ఆ దేశం ఖండించింది.

మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ బుధవారం ఈ విషయమై మాట్లాడుతూ.. తమ ప్రభుత్వం కరోనా వైరస్‌ ల్యాబ్‌ నుంచి వ్యాప్తి చెందిందా? అనే విషయాన్ని తేల్చే పనిలో ఉందన్నారు. ఈ వ్యవహారంలో చైనా నిజానిజాలు వెల్లడించాలని స్టేట్‌ సెక్రెటరీ మైక్‌ పాంపియో డిమాండ్‌ చేశారు. కరోనా వ్యాప్తికి సంబంధించిన సమాచార వెల్లడిలో నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు చైనాపైనా విమర్శలు చేసింది ట్రంప్​ ప్రభుత్వం.

నవంబర్‌లో మరోసారి దాడి!

కరోనా కోరల నుంచి ప్రపంచ దేశాలు ఇంకా కోలుకోలేదు. ఇంతలోనే మరో చేదు వార్త. ఇప్పుడు కుదుటపడినా.. ఆ మహమ్మారి నవంబర్‌లో మరోసారి దాడిచేసే అవకాశం ఉందని చైనా వైద్య నిపుణుడు ఒకరు పేర్కొన్నారు. కరోనా నుంచి విముక్తి ఎప్పుడు లభిస్తుందా అని ఎదురుచూస్తున్న ప్రభుత్వాలకు ఈ విషయం ఆందోళన కలిగిస్తోంది.

షాంఘైలోని 'కొవిడ్‌-19 క్లినికల్‌ ఎక్స్‌పర్ట్‌ టీం'కు నేతృత్వం వహిస్తున్న జాంగ్‌ వెన్‌హాంగ్‌ మాట్లాడుతూ.. రానున్న రోజుల్లో కరోనా మళ్లీ మళ్లీ దాడి చేసే ప్రమాదం ఉన్నందున, ప్రభుత్వాలు అందుకు తగ్గట్టుగా విధానాలను రూపొందించుకోవాలని తెలిపారు.

నవంబర్‌లో మరోసారి దాడి!

ఇదీ చదవండి:మొరపెట్టుకున్నా వినలేదు.. అందుకే ఇలా...

ABOUT THE AUTHOR

...view details