చైనాలో కరోనా వైరస్ కేసులు(China covidcases) అంతకంతకూ పెరుగుతున్నాయి. దీనిని అరికట్టేందుకు తూర్పు తీరం వెంబడి రాష్ట్రాల్లో లాక్డౌన్లు విధించడం సహా పెద్ద సంఖ్యలో టెస్ట్‌లు చేస్తోంది. ఫుజియాన్ ప్రావిన్స్‌లోని పుటియన్ నగరం చుట్టూ ఉన్న ప్రాంతాల్లో టెస్టుల సంఖ్యను పెంచింది. ఈ క్రమంలోనే కరోనా హాట్‌స్పాట్ ప్రాంతాలను అధికారులు పూర్తిగా మూసివేశారు. పుటియన్ నగరంలో కొత్తగా 50 కేసులు నమోదైనట్లు జాతీయ ఆరోగ్య కమిషన్ బుధవారం తెలిపింది.
జియోమెన్, క్వాన్‌జౌలలో డెల్టా వేరియంట్ వ్యాప్తిని దృష్టిలో ఉంచుకొని ప్రయాణాలపై ఆంక్షలు విధించారు అక్కడి అధికారులు. 2019లో వైరస్ మొదట వెలుగు చూసిన వెంటనే.. మధ్య చైనాలోని ఆయా నగరాల్లో తగు చర్యలు చేపట్టిన చైనా ప్రస్తుతం కూడా అలాంటి చర్యలనే అనుసరిస్తోంది. అయితే ఇటీవలి కాలంలోనే కొత్తగా ఫుజియాన్ ప్రాంతంలో 152 కేసులు వెలుగు చూశాయి.
- దీంతో అక్కడి ప్రభుత్వం ప్రజలు ఇళ్లకే పరిమితం కావాలని ఉత్తర్వులు జారీ చేసింది.
- పర్యటక ప్రాంతాలు, రెస్టారెంట్లు, జిమ్‌లపై కఠిన ఆంక్షలు విధించింది.
- ప్రజలు సమూహంగా చేరే ప్రాంతాల్లో కూడా నిషేధాజ్ఞలు కొనసాగిస్తోంది.