తెలంగాణ

telangana

ETV Bharat / international

చైనాలో వరద బీభత్సం- 10మంది మృతి - shenjen

దక్షిణ చైనాలోని షెన్​జెన్​ నగరంలో ఆకస్మిక వర్షాల ధాటికి పదిమంది మృతి చెందారు. ఒక్కసారిగా వరద ముంచెత్తగా అంతర్గత పైపులైన్ల​లో మీటరు నుంచి నాలుగు మీటర్లకు ఒక్కసారిగా నీటిమట్టం పెరిగింది. వాటిలో పనిచేస్తున్న కార్మికులు వరదల్లో చిక్కుకుని మృతిచెందారు.

చైనాలో వరద బీభత్సం... 10మంది మృతి

By

Published : Apr 13, 2019, 1:37 PM IST

దక్షిణ చైనాలోని షెన్​జెన్​ నగరంలో కురుస్తోన్న భారీ వర్షం బీభత్సం సృష్టిస్తోంది. వరదల ధాటికి ఇప్పటివరకు 10మంది మృతి చెందారు. గురువారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురిశాయి.

ఫుటైన్​ జిల్లాలో అంతర్గత పైప్​లైన్​లో పనిచేస్తున్న ఐదుగురు శ్రామికులు ఒక్కసారిగా పోటెత్తిన వరదల్లో మునిగిపోయి మృతి చెందారు. ఇదే జిల్లాలోని మరో పైపులైన్​లో పూడిక తీస్తున్న నలుగురిలో ముగ్గురు వరదల్లో కొట్టుకుపోయి ఫెంగ్​టాంగ్​ నదిలో విగతజీవులుగా తేలారు. లూయోహూ జిల్లాలో వరదల్లో చిక్కుకుపోయిన ఏడుగురిలో ఇద్దరు మృతి చెందారు. నలుగురు సురక్షితంగా బయటపడ్డారు. ఒకరి ఆచూకీ గల్లంతైంది.

200 మంది గజ ఈతగాళ్లు గల్లంతైన వారికోసం వెతుకుతున్నారు. గంటలో 78 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని అధికారులు వెల్లడించారు. ప్రమాద ప్రాంతం టాంగ్లాంగ్ పర్వత ప్రాంతంలో ఉందని ఇక్కడ వరదలు సంభవించే అవకాశం ఎక్కువని అధికారులు వెల్లడించారు.

తక్కువ సమయంలో ఎక్కువ వర్షం కురవడం, అక్కడి ప్రత్యేక పరిస్థితుల కారణంగా సురక్షిత ప్రాంతాలకు వెళ్లడానికి సమయం అనుకూలించలేదన్నారు.

చైనాలో వరద బీభత్సం... 10మంది మృతి

ABOUT THE AUTHOR

...view details