తెలంగాణ

telangana

ETV Bharat / international

చనిపోతూ కొడుక్కు తండ్రి అపూర్వ జ్ఞాపిక - china father

చైనాకు చెందిన వాంగ్​ యూ చనిపోతూ తన కొడుక్కు ఓ ప్రత్యేక జ్ఞాపికను అందించాడు. తాను లేకున్నా ఉన్నట్టుగా భావించేలా పనిచేస్తుందా స్పీకర్. బతికుండగానే కుటుంబ సభ్యుల కోసం తన మాటల్ని రికార్డు చేసే ఓ స్పీకర్​ను తయారు చేయించాడు. తన కొడుక్కు జ్ఞాపికగా అందించాడు. కుటుంబ సభ్యుల్లో మానసిక ధైర్యం నింపాడు.

చనిపోతూ కొడుక్కు తండ్రి అపూర్వ జ్ఞాపిక

By

Published : Apr 8, 2019, 9:03 PM IST

చనిపోయాక తన కుటుంబసభ్యులు ఎప్పటికీ తను లేనని బాధపడకూడదని ఓ తండ్రి తపన పడ్డాడు. చనిపోతానని తెలిసిన తర్వాత కుటుంబసభ్యులకు మరిచిపోలేని జ్ఞాపికను అందించాలనుకున్నాడు. తన మాటలను రికార్డు చేయించి ఓ అత్యాధునిక స్పీకర్​ తయారు చేయించాడు. ఈ స్పీకర్​ను తన కొడుక్కు జ్ఞాపికగా అందించాడు.

చైనా హెనాన్ రాష్ట్రానికి చెందిన వాంగ్ యూకు ఊపిరితిత్తుల క్యాన్సర్. చివరి రోజుల్లో శ్వాస పీల్చుకునేందుకు ఇబ్బందిగా ఉన్నా... దృఢ సంకల్పంతో తన మాటలు రికార్డు చేయించిన ఓ స్పీకర్​ను సిద్ధం చేయించాడు వాంగ్​ యూ.

దూరంగా వేరే పట్టణంలో చదువుకుంటున్న తన కొడుకు పుట్టిన రోజున వెళ్లి ఈ స్పీకర్ ను బహుమతిగా అందించి ఆశ్చర్యపరిచాడు.

'నేను ఈ లోకాన్ని వీడినా...నాకు నీతో మాట్లాడుతున్నట్లే అనిపిస్తుంది' అంటూ.. తానెంతో శ్రమించి తయారుచేయించిన స్పీకర్​ను కొడుక్కు బహుమతిగా ఇచ్చాడు.

అదే రోజు వాంగ్ భార్య తన డైరీలో ఒక సందేశం రాశారు. "మీ నాన్న ఏదో ఒకరోజు నిన్ను వీడిపోయాక.. ఈ స్పీకర్​తో మాట్లాడు. అది నీ మాటలు వింటుంది. నీకు సమాధానం ఇస్తుంది. కన్నా... నీ నాన్న గొంతు గుర్తుపెట్టుకో. ఎంతగా అంటే తను నిన్ను వీడిపోలేదు అన్నంతగా.." అనేదే ఆ సందేశం.

అనంతరం కొన్ని నెలల తర్వాత క్యాన్సర్​తో పోరాడుతూ గతేడాది డిసెంబరులో తుది శ్వాస విడిచాడు వాంగ్​యూ. వాంగ్​ యూ భౌతికంగా ఈ లోకంలో లేక పోయినా, తన మాటలతో కుటుంబసభ్యులకు మానసికంగా చేరువగానే ఉన్నాడు.

చైనావ్యాప్తంగా నిర్వహించే 'టూంబ్ స్వీపింగ్ ఫెస్టివల్'​లో చనిపోయిన తమ కుటుంబ సభ్యులను స్మరించుకుంటారు. వారి సమాధుల వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారు. తమ ఆప్తులను తలచుకుని కన్నీటి పర్యంతమవుతారు. వాంగ్​ కుటుంబానికి అరుదైన జ్ఞాపిక మూలంగా ఆ దుఃఖం తగ్గింది.

ఇదీ చూడండి: కృత్రిమ మేధతో 'రోబో సైనికులు' వస్తున్నారు!

ABOUT THE AUTHOR

...view details