తెలంగాణ

telangana

ETV Bharat / international

30 వేల ప్రపంచ పటాలను ధ్వంసం చేసిన చైనా

తైవాన్​ను ప్రత్యేక దేశంగా, అరుణాచల్​ప్రదేశ్​ను భారత్​లో భాగంగా ముద్రించిన 30 వేల ప్రపంచపటాలను చైనా ధ్వంసం చేసింది. అరుణాచల్​ ప్రదేశ్​ తమ దేశంలో భాగమనే వాదన వినిపిస్తోంది.

30 వేల ప్రపంచ పటాలను ధ్వంసం చేసిన చైనా

By

Published : Mar 26, 2019, 11:45 PM IST

అరుణాచల్​ ప్రదేశ్​ను భారత్​లో భాగంగా చూపిస్తోన్న 30 వేల ప్రపంచ పటాలను చైనా ధ్వంసం చేసింది. ఇతర దేశాలకు ఎగుమతి చేసేందుకు స్థానిక సంస్థలు ముద్రించిన ఈ ప్రపంచ పటాలను చైనా ప్రభుత్వం రద్దుచేసింది. తైవాన్​ను ప్రత్యేక దేశంగా, అరుణాచల్​ ప్రదేశ్​ను భారత్​లో భాగంగా ముద్రించంపై డ్రాగన్​ దేశాధినేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

చైనా వాదన

భారత ఈశాన్య రాష్ట్రాల్లో ఒకటైన అరుణాచల్​ ప్రదేశ్​ దక్షిణ టిబెట్​లో భాగమని చైనా వాదిస్తోంది. భారత రాజకీయ నేతలు అరుణాచల్​ ప్రదేశ్​లో పర్యటిస్తున్న ప్రతిసారీ డ్రాగన్​ దేశం అభ్యంతరం వ్యక్తం చేస్తోంది.

భారత్​ వాదన

అరుణాచల్​ప్రదేశ్​ భారత్​లో అంతర్గత భాగం. రాజకీయ నేతలు దేశంలోని ఇతర ప్రాంతాలకు వెళ్లిన విధంగానే అరుణాచల్​ప్రదేశ్​కు కూడా వెళ్తారనేది భారత్​ వాదన.

ఇరుదేశాల మధ్య 21 సార్లు చర్చలు

భారత్​-చైనా మధ్య 3,488 కిలోమీటర్ల వాస్తవాధీన రేఖ(ఎల్​ఏసీ) ఉంది. వివాదాస్పదమైన అరుణాచల్​ప్రదేశ్​ అంశంపై ఇరుదేశాల నేతలు ఇప్పటికే 21 సార్లు చర్చించారు.

ABOUT THE AUTHOR

...view details