బిహార్‌లో గంగా నదిపై నిర్మిస్తోన్న మెగా ప్రాజెక్టులో... చైనా కంపెనీల ప్రమేయమున్న టెండర్‌ను రద్దు చేసింది కేంద్రం.
గంగానదిపై మహాత్మా గాంధీ సేతుకు సమాంతరంగా వంతెన నిర్మించాలని 2019 డిసెంబర్ 16న ప్రధాని నరేంద్ర మోదీ మంత్రివర్గం నిర్ణయించింది. 5.6 కిలోమీటర్ల పొడవైన వంతెనతో పాటు, చిన్న చిన్న బ్రిడ్జులు, నాలుగు అండర్‌పాస్ రోడ్లు, ఐదు బస్ స్టాండ్లు, 13 రోడ్ జంక్షన్లు, 1.58 కి.మీల మేర రైల్వే బ్రిడ్జ్‌లు ఈ ప్రాజెక్టులో భాగమే. ఈ బ్రిడ్జ్ నిర్మాణం పూర్తయితే.. బిహార్‌లోని పట్నా, శరణ్, వైశాలి జిల్లాలు లబ్ధి పొందుతాయి. ఈ నిర్మాణాన్ని 2023 జనవరినాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది కేంద్రం.
బ్రిడ్జ్‌ను అనుకున్న సమయంలో పూర్తి చేసేందుకు కాంట్రాక్టర్లను ఎంపిక చేసింది. ఇంతలోనే ఆ కాంట్రాక్టర్లలో చైనా కంపెనీల ప్రమేయముందని తెలిసి ఆ టెండర్‌ను రద్దు చేసింది. దీంతో దాదాపు రూ. 2,900 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న ఈ భారీ ప్రాజెక్టులోంచి చైనాను బహిష్కరించినట్లైంది.