తెలంగాణ

telangana

ETV Bharat / international

అఫ్గాన్​లో ఆత్మాహుతి దాడి- 16 మంది మృతి

అఫ్గానిస్థాన్​లో ఆదివారం కారు బాంబు పేలింది. ఘోర్ రాష్ట్ర పోలీసు చీఫ్ కార్యాలయం వద్ద జరిగిన ఈ ఆత్మాహుతి దాడిలో 16 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో వందమందికిపైగా గాయాలయ్యాయి.

Car bombing in Afghanistan kills 16
ఆత్మాహుతి కారు బాంబు దాడి

By

Published : Oct 18, 2020, 3:48 PM IST

అఫ్గానిస్థాన్​లోని ఘోర్​ రాష్ట్రంలో ఆదివారం జరిగిన ఆత్మాహుతి కారు బాంబు దాడిలో 16 మంది మరణించారు. ఈ ఘటనలో వందమందికిపైగా గాయాలయ్యాయి.

గాయాలపాలైన డజన్ల కొద్ది మందికి ఘోర్​లోని ఓ ఆస్పత్రిలో అత్యవసర చికిత్స అందిస్తున్నారు. వీరిలో చాలా మంది పరిస్థితి విషమంగా ఉందని, మృతుల సంఖ్య మరింత పెరగొచ్చని ఆస్పత్రి వర్గాలు చెబుతున్నాయి.

ప్రాతీయ పోలీసు చీఫ్​ కార్యాలయం, ప్రభుత్వ భవన సముదాయాల సమీపంలో ఈ బాంబు పేలినట్లు అధికారులు వెల్లడించారు.

ఆయితే ఈ దాడికి బాధ్యత వహిస్తూ ఏ గ్రూపు ఇంత వరకు ప్రకటన చేయలేదు. ఫిబ్రవరిలో తాలిబన్లతో కుదుర్చుకున్న శాంతి ఒప్పందం ప్రకారం దాడులు నిలిపివేస్తామని అమెరికా ప్రకటించిన తర్వాత ఈ దాడి జరగటం గమనార్హం. ఇటీవలే వేలాది మందిని తరలించిన తర్వాత.. దక్షిణ అఫ్గానిస్థాన్​లో దాడులను ఆపేసేందుకు తాలిబన్లు శుక్రవారం ఆమోదం తెలిపారు.

ఇదీ చూడండి:హైతీలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా రోడ్డెక్కిన ప్రజలు

ABOUT THE AUTHOR

...view details