అఫ్గానిస్థాన్‌ను(Afghanistan news) తమ వశం చేసుకున్న తాలిబన్లు (Afghan Taliban).. తమకు వ్యతిరేకంగా పోరాడిన వారిపై ప్రతీకార చర్యలు చేపడుతున్నారు. దొరికిన వారిని దొరికినట్లుగా.. బహిరంగంగానే చంపేస్తున్నారు. తాజాగా తమకు లొంగిపోయిన ఓ పోలీసు అధికారిపై తూటాల వర్షం కురిపించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. అధికారిని పొట్టనపెట్టుకున్న దృశ్యాలు అఫ్గాన్‌లోని పరిస్థితులకు అద్దం పడుతున్నాయి.
హెరత్ రాష్ట్రంలోని బాద్గీస్ నగర పోలీసు చీఫ్ హాజి ముల్లా అచక్జాయ్ తాలిబన్లకు లొంగిపోయారు. ఆయన కళ్లకు తాలిబన్లు గంతలు కట్టి మోకాళ్లపై కూర్చోబెట్టి.. ఆ తర్వాత పలు రౌండ్ల కాల్పులు జరిపినట్లు న్యూయార్క్ పోస్ట్ వెల్లడించింది.
'ఇది వారి ప్రజా క్షమాభిక్ష..'