తెలంగాణ

telangana

ETV Bharat / international

స్టైల్​ ఎక్కువైతే ఫైన్​... బంగ్లా​లో కొత్త నిబంధన

ఆ దేశంలోని ఓ ప్రాంత యువకులకు పెద్ద కష్టమే వచ్చి పడింది. తమకిష్టమైన పాశ్చాత్య తలకట్టు చేయించుకోవడానికి వీలు లేకుండా పోయింది. ఎందుకు? ఎక్కడ?

పాశ్చాత్య తలకట్టుతో కుర్రకారు

By

Published : Mar 22, 2019, 5:39 PM IST

Updated : Mar 22, 2019, 11:06 PM IST

కుర్రకారుకు తలకట్టంటే విపరీతమైన మోజు. తమను మరింత అందంగా చూపించే తలకట్టు చేయించుకోవాలని, పాశ్చాత్య రీతులను అనుసరించడానికి వారు చేసే ప్రయత్నాలకు గమ్యస్థానం హెయిర్​ సెలూన్లే మరి. అంత ప్రాముఖ్యమైన మార్పులకు నాంది పలికే ​ సెలూన్లు పాశ్చాత్య స్టైల్స్​ చేయలేం మొర్రో అని మొండికేస్తే ఎలా ఉంటుంది... బంగ్లాదేశ్​లోని భువాపూర్​లా ఉంటుంది.

బంగ్లాదేశ్​ లోని భువాపూర్ బార్బర్ అసోసియేషన్ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. తమవద్దకు తలకట్టు చేయించుకోవాలని వచ్చే కుర్రకారుకు పాశ్చాత్య స్టైల్స్​ను చేయవద్దని తీర్మానించింది. ఎవరైనా తమ ఆదేశాలను ఉల్లంఘిస్తే 480 అమెరికన్ డాలర్ల జరిమానా విధిస్తామని హెచ్చరించింది.

కారణమేంటి...?

బంగ్లాదేశ్ యువకులు బాలీవుడ్, హాలీవుడ్ హీరోలు, అభిమాన క్రికెటర్లను అనుకరిస్తూ కటింగ్ చేయించుకుంటున్నారు. యువకుల తీరును చూసి ఓ పోలీసు అధికారికి చిర్రెత్తిపోయింది. యువత పెడదారి పడుతోందని భావించి భువాపూర్​లోని తల్లిదండ్రులు, బార్బర్లతో సమావేశం ఏర్పాటుచేశారు. యువకులకు పాశ్చాత్య కటింగ్​లు చెయ్యొద్దని వినతి చేశారు. అంగీకరించిన బార్బర్ల సమాఖ్య యువకులకు పాశ్చాత్య కటింగ్​ చేయకూడదని నిర్ణయించింది. భువాపూర్​ను అనుసరిస్తూ సమీపంలోని సఖీపుర్, బసియాల్ బార్బర్ సమాఖ్యలు ఇదే విధమైన తీర్మానాలు చేశాయి.

ఇదీ చూడండి:భారత్‌ భేరి: నాయకుడు లేని ఉద్యమం దారెటు?

Last Updated : Mar 22, 2019, 11:06 PM IST

ABOUT THE AUTHOR

...view details