తెలంగాణ

telangana

By

Published : Jan 3, 2020, 9:40 PM IST

ETV Bharat / international

ఆస్ట్రేలియా ప్రధాని మోరిసన్​ భారత పర్యటన రద్దు

భారత పర్యటనను ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్ రద్దు చేసుకున్నారు. స్వదేశంలో కార్చిచ్చు బీభత్సం సృష్టిస్తోన్న నేపథ్యంలోనే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు దౌత్యవర్గాలు తెలిపాయి.

Australian PM calls off India visit due to bush fires back home
ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్​ మోరిసన్​ భారత్​ పర్యటన రద్దు

ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్​ భారత పర్యటనను రద్దు చేసుకున్నారు. ఈ నెల 13 నుంచి నాలుగు రోజులపాటు ఆయన భారత్​లో పర్యటించి, ప్రధాని నరేంద్ర మోదీతో ద్వైపాక్షిక చర్చలు జరపాల్సి ఉంది. అయితే స్వదేశంలో కార్చిచ్చు బీభత్సం సృష్టిస్తోన్న నేపథ్యంలో ఆయన భారత పర్యటనను రద్దు చేసుకున్నట్లు దౌత్యవర్గాలు తెలిపాయి.

మోరిసన్ తన పర్యటనలో భాగంగా విదేశాంగ మంత్రిత్వశాఖ నిర్వహిస్తోన్న రైసిన్​ డైలాగ్​లో ప్రసంగించవలసి ఉంది. దీని తరువాత మోరిసన్ ముంబయి, బెంగళూరులను కూడా సందర్శించాలనుకున్నారు.

కార్చిచ్చు బీభత్సం

ఆస్ట్రేలియాలోని న్యూసౌత్​వేల్స్​, విక్టోరియా రాష్ట్రాల్లో దావానలం ఇంకా వ్యాపిస్తూనే ఉంది. ఇప్పటి వరకు మంటలకు చిక్కి 20 మంది ప్రాణాలు కోల్పోయారు. సుమారు 500 ఇళ్లు దగ్ధమయ్యాయి. విక్టోరియాలోని మల్లకూట ప్రాంతంలో దాదాపు 3000 మంది పర్యటకులు సహా 4 వేల మంది చిక్కుకుపోయారు.

మోదీ పరామర్శ

ఇంతకు ముందు ప్రధాని మోదీ.. స్కాట్​ మోరిసన్​తో టెలిఫోన్​లో సంభాషించారు. కార్చిచ్చు వల్ల ఏర్పడిన భారీ ప్రాణ, ఆస్తి నష్టంపై భారతీయులందరి తరఫున సంతాపం వ్యక్తం చేశారు. ఈ ప్రకృతి విపత్తును ధైర్యంగా ఎదుర్కొంటున్న ఆస్ట్రేలియా ప్రజలకు భారత్​ మద్దతుగా నిలుస్తుందని భారత విదేశాంగశాఖ కూడా ప్రకటించింది.

ఇదీ చూడండి: గగన్​యాన్​ వ్యోమగాముల కోసం డీఆర్​డీఓ ఆహారం!

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details