గగన్‌యాన్ యాత్రలో పాల్గొనే భారత వ్యోమగాముల కోసం డీఆర్డీఓకు చెందిన మైసూర్‌లోని 'డిఫెన్స్ ఫుడ్ రీసెర్చ్ లాబొరేటరీ' ప్రత్యేక ఆహార పదార్థాలను సిద్ధం చేస్తోంది. ఇందు కోసం ఆ సంస్థ ఏడాది కాలంగా పలు పరిశోధనలు నిర్వహించింది.
"అంతరిక్షంలో పయనించే వ్యోమగాములు ఇక్కడ మనం తినేలాంటి ఆహారమే తీసుకుంటారు. అందుకోసమే చికిన్ పలావ్, రాజ్మా, హల్వా లాంటి ఆహార పదార్థాలను సిద్ధం చేశాం. అయితే అంతరిక్షంలో గ్రావిటీ (గురుత్వాక్షరణ) ఉండదు. అందువల్ల ఆహారాన్ని బయటకు తీస్తే అది వ్యోమనౌక అంతటా చెల్లాచెదురవుతుంది. ఫలితంగా పలు సమస్యలు ఎదురవుతాయి. దీనికి పరిష్కారం కనుగొనేందుకు ఏడాదికి పైగా పరిశోధనలు చేసి అంతరిక్షంలోని అవసరాలకు తగ్గట్టుగా (థియరిటికల్‌గా) ఆహారాన్ని తయారుచేశాం. అయితే ఈ ఆహార పదార్థాలను జీరో గ్రావిటీలో పరిశీలించేందుకు మా దగ్గర ఎలాంటి సౌకర్యాలు లేవు. అందుకే ఇస్రోకు లేఖ రాశాం. ఇస్రో చేపట్టే మానవరహిత అంతరిక్ష ప్రయోగంలో ఈ ఆహార పదార్థాలను పరిశీలించాలనుకుంటున్నాం." - జగన్నాథ్, డిఫెన్స్ ఫూడ్ రీసెర్చ్ లాబొరేటరీ శాస్త్రవేత్త
ఇదీ చూడండి: గురి చూసి గోల్ కొట్టిన జింక... ఆపై గంతులు!