ఆస్ట్రేలియా చట్టసభకు ఎన్నికలు జరుగుతున్నాయి. ప్రజలు ఉత్సాహంగా పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ప్రతిపక్ష లేబర్ పార్టీ ప్రధాని అభ్యర్థి బిల్ షార్టెన్ మెల్బోర్న్లో ఓటు వేశారు. విజయంపై ధీమా వ్యక్తం చేశారు.
ప్రస్తుత ప్రధాని స్కాట్ మారిసన్ సైతం గెలుపు తమదేన్నారు.
"వాతావరణ మార్పులపై చర్యల్లో కేవలం వట్టిమాటలకు కాకుండా, పనులకు మాత్రమే ఆస్ట్రేలియా ప్రజలు ఓటేశారు. మేము విజయానికి సిద్ధమయ్యాం."