తెలంగాణ

telangana

ETV Bharat / international

ఇండోనేషియాలో భారీ భూకంపం- బైకర్ మృతి

ఇండోనేషియా మలుకు రాష్ట్రం​ అంబన్​ నగరంలో భారీ భూకంపం సంభవించింది. భూకంప లేఖినిపై 6.5 తీవ్రత నమోదైంది. పలుచోట్ల భవనాలు కుప్పకూలాయి. భూకంపం ధాటికి ఓ వ్యక్తి ద్విచక్రవాహనంపై నుంచి పడి మరణించాడు.

ఇండోనేషియాలో భారీ భూకంపం- బైకర్ మృతి

By

Published : Sep 26, 2019, 12:14 PM IST

Updated : Oct 2, 2019, 1:51 AM IST

ఇండోనేషియాలో భారీ భూకంపం- బైకర్ మృతి

ఇండోనేషియాను భూకంపం కుదిపేసింది. మలుకు రాష్ట్రం అంబన్​ నగరంలో భూకంపం ధాటికి పలు భవనాలు కుప్పకూలాయి. భూకంప లేఖినిపై తీవ్రత 6.5గా నమోదైంది. ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.

భూకంపం ధాటికి ఓ వ్యక్తి ద్విచక్రవాహనంపై నుంచి పడి మరణించాడు. మరో వ్యక్తి ఆచూకీ గల్లంతైంది. అనేక మంది తీవ్రంగా గాయపడ్డారు. శిథిలాల కింద చాలా మంది చిక్కుకుపోయారు. వారిని కాపాడేందుకు సహాయ బృందాలు రంగంలోకి దిగాయి.

అంబన్​ నగరానికి ఈశాన్య దిశగా సుమారు 37 కిలోమీటర్ల దూరంలో 29 కిలోమీటర్ల లోతున భూకంపం కేంద్రీకృతమై ఉన్నట్లు అమెరికా జియోలాజికల్​ సర్వే తెలిపింది.

అంబన్ నగరంతోపాటు చుట్టు పక్కల ప్రాంతాల్లోనూ భూకంపం ప్రభావం చూపినట్లు విపత్తు నిర్వహణ అధికారులు తెలిపారు.

ఇదీ చూడండి:విద్యార్థుల నిరసనలతో భగ్గుమన్న ఇండోనేసియా

Last Updated : Oct 2, 2019, 1:51 AM IST

ABOUT THE AUTHOR

...view details