యెమెన్‌లో ప్రభుత్వ మద్దతుదారులు, వేర్పాటువాదులకు మధ్య జరుగుతున్న ఘర్షణలు తారస్థాయికి చేరాయి. అడెన్లో జరుగుతున్న ఈ గొడవల్లో ఇప్పటివరకు 40 మంది మృత్యువాత పడ్డారు. మరో 260 మంది తీవ్రంగా గాయపడ్డారని ఐక్యరాజ్యసమతి వెల్లడించింది.
యెమెన్‌లో తారస్థాయికి ఘర్షణలు.. 40 మంది మృతి
యెమెన్‌లో ప్రభుత్వ మద్దతుదారులు, వేర్పాటువాదులకు మధ్య ఘర్షణలు తీవ్రస్థాయిలో జరుగుతున్నాయి. గత మూడు రోజులుగా జరుగుతున్న ఈ ఆందోళనల్లో ఇప్పటివరకు 40 మంది ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు గాయపడ్డారు.
యెమెన్‌లో తారస్థాయికి ఘర్షణలు
ఈద్ అల్ అదా సందర్భంగా కుటుంబాలతో కలిసి శాంతియుతంగా, సంతోషంగా గడపాల్సిన సమయంలో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారని యూఎన్ విచారం వ్యక్తం చేసింది. గాయపడ్డవారి కోసం వైద్య బృందాలను పంపనున్నట్లు వెల్లడించింది.
"ఈ నెల 8వ తేదీ నుంచి ఆడెన్లో ప్రభుత్వ మద్దతుదారులు, వేర్పాటువాదులకు మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ ఘర్షణల్లో ఇప్పటివరకు 40 మంది స్థానికులు మృతి చెందారు."
- ఐక్యరాజ్య సమితి
Last Updated : Sep 26, 2019, 4:36 PM IST