అఫ్గానిస్థాన్‌లో తాలిబన్ల 'ఆట' మొదలైంది! ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొద్ది రోజులకే.. 1996 నాటి పాలనను గుర్తుచేసేశారు. దేశంలో జరుగుతున్న మహిళల నిరసనలపై ఉక్కుపాదం మోపి.. ఆందోళనలను చిత్రీకరిస్తున్నజర్నలిస్టులపై అమానవీయంగా దాడికి పాల్పడ్డారు. అత్యంత కఠినంగా ఉండే ఇస్లాం చట్టాలను ఇప్పటికే అమల్లోకి తీసుకొచ్చారు(taliban news). దీంతో అఫ్గాన్‌లో 20ఏళ్లుగా సాధించిన అభివృద్ధి ఏమైపోతుందోనని ఆందోళన నెలకొంది.
హామీలను విస్మరించి...
ఆగస్టు 15న కాబుల్‌ను ఆక్రమించుకుని జెండా ఎగరేశారు తాలిబన్లు. సంక్షోభం మధ్య ఇటీవలే ఆపద్ధర్మ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. గతంలో ఇచ్చిన ఎన్నో హామీలు.. కేబినెట్ కూర్పులో కనపడలేదు(taliban government). తాలిబన్యేతర సభ్యులను కేబినేట్లో చేర్చుకోవాలన్న డిమాండ్‌ను పక్కనపెట్టేశారు. అయినా ప్రపంచ దేశాలు ఏమీ చేయలేని పరిస్థితి! ఇంకా చెప్పుకోవాలంటే.. ఇష్టం లేకపోయినా తాలిబన్లతో ప్రపంచ దేశాలు కలిసి పనిచేయాల్సి వస్తోంది.
అఫ్గాన్‌లో అమెరికా బలగాల తరలింపు ఆగస్టు 31తో ముగిసింది. కానీ దేశంలో చాలా మంది అమెరికా పౌరులు, అగ్రరాజ్యానికి ఇన్నేళ్లు సహాయం చేసిన కుటుంబాలు మిగిలిపోయాయి. వారిని బయటకు తీసుకురావాలంటే అమెరికాకు తాలిబన్లు సహాయం చేయాల్సిందే(us taliban news). మరోవైపు అగ్రరాజ్యానికి ఇస్లామిక్ స్టేట్‌తో ఉగ్రముప్పు తీవ్రమవుతోంది. కరుడుగట్టిన ఈ ఉగ్రముఠాను అడ్డుకోవాలన్నా.. అఫ్గాన్ ప్రభుత్వంతో అమెరికా కలిసి పనిచేయాల్సి ఉంటుంది.
ఇదీ చూడండి:-నిరసనలు ఆపేయండి.. పౌరులకు తాలిబన్ల హుకుం
అటు అంతర్జాతీయ సంఘం.. అఫ్గాన్‌లో(afghanistan news) విలవిలలాడుతున్న ప్రజలకు తమవంతు సహాయం చేస్తోంది. తాలిబన్ల రాక ముందే అఫ్గాన్ ప్రజలు తీవ్ర కరవులో ఉన్నారు. ఆహారం దొరకక ఎన్నో ఇబ్బందులు పడ్డారు. దీంతో 1.1కోట్ల మంది అఫ్గాన్ ప్రజలను ఆదుకునేందుకు 606మిలియన్ డాలర్ల నిధులను అత్యవసరంగా సేకరిస్తోంది. ఖతార్ విమానాలు తరచూ ఆహార పొట్లాలు, వైద్య సామగ్రితో అఫ్గాన్‌కు వెళుతున్నాయి. పాకిస్థాన్ కూడా అఫ్గాన్‌కు సహాయం చేస్తోంది(pak taliban news).
ఇక అఫ్గానిస్థాన్.. ఆర్థిక సంక్షోభం అంచులో ఉంది. చాలా మంది ప్రజలు రోజుకు 2డాలర్ల కన్నా తక్కువ సంపాదనతో జీవిస్తున్నారు. 80శాతం దేశ బడ్జెట్ విదేశీ నిధుల నుంచి వస్తోంది. తాలిబన్ల రాకతో నిధులకు కోతపడింది. మరోవైపు ఇప్పుడక్కడ నిరుద్యోగం తారస్థాయిలో ఉంది. యువతను చేర్చుకునేందుకు పరిశ్రమలేవీ ముందుకు రావడం లేదు.
ఇన్ని కష్టాలున్నా.. విదేశీ నిధులు తగ్గిపోయినా.. 'మాకు ఎవరి సహాయం వద్దు.. మా దేశాన్ని మాకు నచ్చినట్టు మేము పాలించుకుంటాము,' అన్నట్టుగా తాలిబన్ల ప్రస్తుత వైఖరి ఉంది. ప్రపంచ దేశాలు కోరినట్టుగా తాలిబన్ల కేబినెట్ లేకపోవడం ఇందుకు ఉదాహరణ. పైగా.. ఎఫ్‌బీఐ వాంటెడ్ లిస్ట్‌లో ఉన్న సిరాజుద్దీన్ హక్కానీ.. అంతర్గత వ్యవహారాల మంత్రిగా నియమించడం గమనార్హం.
తాలిబన్ల వ్యూహమేంటి?