ఉత్తర సిరియాలో శనివారం భారీ పేలుడు సంభవించింది. ఓ షిప్పింగ్ గిడ్డంగిలో జరిగిన ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు. మరో ఐదుగురు గాయపడ్డారు. టర్కీ సరిహద్దు సమీపంలోని అల్-బాబ్ పట్టణంలో ఈ ఘటన జరిగింది. ప్రమాదానికి కారణాలు తెలియరాలేదు. సహాయక చర్యలు చేపట్టిన అగ్నిమాపక అధికారులు.. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు.
సిరియాలో పేలుడు- ఇద్దరు మృతి - Aleppo province
సిరియాలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఇద్దరు చనిపోగా.. మరో ఐదుగురు క్షతగాత్రులయ్యారు. అగ్నిమాపక దళాలు సహాయక చర్యలు చేపట్టాయి.
సిరియాలో భారీ అగ్ని ప్రమాదం- ఇద్దరు మృతి
టర్కీ మద్దతు ఉన్న తిరుగుబాటుదారులు.. 2016, 2018లో సిరియాపై దాడి చేసి అల్-బాబ్తో సహా అలెప్పో రాష్ట్రంలోని మరికొన్ని ప్రాంతాలను తమ అధీనంలోకి తీసుకున్నారు. ఇప్పుడు అదే ప్రాంతంలో పేలుడు జరిగింది.
ఇదీ చూడండి:బీచ్లో ఘర్షణ.. పెప్పర్ బాల్స్ ప్రయోగం